భారము గైకొనవయ్యా
కుజనులు నిందలు కురిసెడు వేళ
స్వజనము తప్పులు పట్టెడు వేళ
రుజలకు దేహము లొంగెడు వేళ
సుజనావన దయజూపుమురా
తనవున స్వాస్థ్యము తప్పెడు వేళ
మనసున శాంతియె మసకగు వేళ
కనులకు నిదురయె కరువగు వేళ
నను కాపాడర నారామా
కలిమాయలు నను క్రమ్మెడు వేళ
కలబడి కాలుడు కట్టెడు వేళ
కలవలె బ్రతుకే కరిగెడు వేళ
తలగాచగదే దాశరథీ
చాలా బాగుంది కీర్తన. నిత్యం పాడుకోవటానికి అనువుగా ఉంది
రిప్లయితొలగించండి