శ్రీరామచంద్ర నీవు నా చిత్తమున నిలువుమా
కూరిమితో నిన్ను కొలుచుకొందు నానందముగా
శ్రీరామచంద్ర నీ చరితము చేసెద పారాయణము
శ్రీరామచంద్ర నీ నామము చేసెద ననునిత్యము
శ్రీరామచంద్ర నీ గుణమును చెలగి కీర్తించెదను
శ్రీరామచంద్ర నీ శౌర్యము నూరూరా చాటెదను
శ్రీరామచంద్ర నాకు ప్రాణాధారము నీవందును
శ్రీరామచంద్ర నీవే నా జీవనమని యందును
శ్రీరామచంద్ర నెన్నెప్పుడు సేవించుచు నుందును
శ్రీరామచంద్ర నాభాగ్యము నీరక్షణ యందును
శ్రీరామచంద్ర సీతాపతి క్షితిమండల నాయకా
శ్రీరామచంద్ర యోగిరాజసేవ్యమాన పాదుకా
శ్రీరామచంద్ర సర్వలోక క్షేమంకర రాఘవా
శ్రీరామచంద్ర భవార్ణవతారకా మహాప్రభో
శ్రీరామచంద్రుని కీర్తన చాలా బాగుంది 🙏🙏
రిప్లయితొలగించండి