7, జనవరి 2019, సోమవారం
రాముడా నీవేమో రమ్యగుణార్ణవుడవు
రాముడా నీవేమో రమ్యగుణార్ణవుడవు
నామానుషం బిది దుర్గుణంబుల పుట్టాయె
అటులయ్యు నీవు నన్నాదరించు నేస్తుడవు
కటువు లెప్పు డాడక గారవింతు
వెటులైన సద్గుణముల నెన్ని కొన్నింటిని
దిటవుగ నాకిచ్చి నన్ను దిద్దరాదే
ఎన్ని జన్మములనెత్తి యేమినేర్చితి నేను
చిన్నమెత్తు తత్త్వచింత చేయనైతి
నెన్నెన్నో దుర్గుణముల మిన్నాగుల పుట్టనై
యున్నాను నీవు నన్నుధ్ధరించవే
వేడుకతో నిన్నెల్లవేళలను కొలిచెదను
చూడగా నదొక్కటే సుగుణము నాది
వేడువారి కీవు మోక్షవితరణశీలుడవు నా
కేడుగడవు కాన నన్నేలుకోవే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆ రాముని సన్నిధి, ఆరాటము బాపు పెన్నిధి - అనిపిస్తాయి మీ రామకీర్తనలు.
రిప్లయితొలగించండి