2, జనవరి 2019, బుధవారం
నేను కోరినది యేమి. నీవిచ్చినది యేమి
నేను కోరినది యేమి నీవిచ్చినది యేమి
కానిమ్ము రామ నేను కాదన వశమా
జరిగిన దేనాడో జరిగిన దింకేల వగవ
మరల తొల్లిటి వలెను మన ముందమన్నచో
సరకుచేయక వినతి జన్మము లెత్తింతువు
పరమాత్ముడా నీవు భలేవాడవే
గుణగణాతీతుడవు గుణనియామకుడ వని
గుణములలో కొన్ని మంచి గుణములిమ్మని వేడ
గుణము లంటగట్టతివి కొరగాని వెన్నెన్నో
గుణమిట్టిదా నీది గొప్పవాడవే
యుక్తి చేసి తొల్లింట నుంచుమని కోరునట్టి
భక్తుని విన్నపమును పట్టించుకొన వీవు
రక్తిలేదు సంసారమున నని మొత్తుకొన్న
ముక్తినీయవే భలే మోసగాడవే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శ్రీరామసంకీర్తనంలో, ఈ సంకీర్తన 501వది.
రిప్లయితొలగించండిఅనన్యభక్తితో మీరు రాస్తున్న రామకీర్తనలు ప్రశంసనీయం.
రిప్లయితొలగించండినాకు అత్యంత ప్రీతికరం.
అభినందనలు సర్.
మీ బ్లాగ్ లోనే సెప్టెంబర్ 2016 “శ్రీరామసంకీర్తనం” టపా క్రింద నిన్న నేను అన్నట్లుగా రెండవ 500ల సంకీర్తనల విడత కూడా మొదలైపోయింది, చూశారా. మీ సంకల్పబలం అటువంటిది. సంతోషం. రెండవ విడత కూడా అచిరకాలంలోనే సంపన్నం అవుతుందని, ఆ తరువాత కూడా కొనసాగుతుందనీ నా నమ్మకం 👍.
రిప్లయితొలగించండినిను కాదన వశమా' అని చదివినా బాగుంది
రిప్లయితొలగించండి-యంకె శర్మ
అవునండి.
తొలగించండి