26, జనవరి 2019, శనివారం
ముదమారగ నినుతలచుచు మురియుచుందు నెల్లప్పుడు
ముదమారగ నినుతలచుచు మురియుచుందు నెల్లప్పుడు
నిదురమాట మరచితిరా నిదురనన్ను విడచెనురా
కలలలోన నీరూపము తిలకించెడు మానసమున
మెలకువలో నీరూపమె మెదలుచున్న వేళలందు
కలలో నినుజూచుటకై కనులు మూసి నిదురింపగ
వలసిన పనియేమని నే భావింతునురా సఖుడా
అలసిసొలసి లోకులెల్ల రాదమరచి నిదురించ
కలుషితమగు మానసముల కల్లోలతరంగాల
యలజడి లేనట్టి వైన యందమైన రాత్రులందు
మెలకువతో నుండి నిన్ను పలుకరింతురా సఖుడా
ఎన్నెన్నో యూహలేమి ఏవేవో పలుకు లేమి
యన్నిటికిని వీలు సుమా యర్థరాత్రి సమయములు
ఎన్నెన్నో జన్మములుగ నిదే పనిగ గడచుచుండ
ఉన్నవయా పవళులడ్డు నన్నేలెడు రాముడా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముదమారగ నినుతలచుచు మురియుచుందు....
రిప్లయితొలగించండిశ్రీరామసంకీర్తనంలో ఇది 550వ కీర్తన