18, జనవరి 2019, శుక్రవారం

దైవమా ఓ దయలేని దైవమా


దైవమా ఓ దయలేని దైవమా
జీవుని యెనెన్ని చిక్కుల బెట్టేవే

దయగలదు నీకని తరచుగ పొగడితే
దయపుట్టు ననుకొన్నది తప్పయ్యేనే
జయపెట్టుచు నీముందు సాగిలపడిన గాని
నయముగ చూడవే న్యాయమేనా

పడద్రోసి నన్నిట్లు ప్రళయభవజలధిని
గడుసుగా డాగియుండి గమనించేవే
విడుదల యెప్పుడో వివరముగ తెలియని
జడునిగ చేయుటేమి సంతోషమే

ఏమేమో విందు మారాముడ వీవేనట
రాముడంటే సర్వజగద్రక్షకుడేను
నా మీద దయకలగి నన్ను రక్షించవు
మా మంచి దైవమవె మన్నింపవే

5 కామెంట్‌లు:

  1. మీరు ముందుమాట రాసిన నా ఇ.బుక్ కినిగెలో ప్రచురుంపబడింది.
    ఈలింక్ లోచూడగలరు.
    http://kinige.com/kbook.php?id=9258

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శర్మగారు,
      ధన్యవాదాలు.
      చూసాను.
      ఆ ముందుమాటలో దురదృష్టవశాత్తు అక్షరదోషాలు బహుళంగా కనిపించాయి. వీలైతే సరిజేయప్రార్థన. అక్షరదోషాలకు కారణం నాచేతివ్రాత బాగుండకపోవటం అనుకుంటున్నాను. చేతితో వ్రాసే అలవాటు దశాబ్దాలుగా తప్పిపోయింది మరి.

      తొలగించండి
    2. శ్యామలరావు గారు
      నమస్తే.

      నా కోరిక మేర, మీరు చేతి రాతతో పంపిన ముందుమాట కినిగెవారికి అలాగే పంపించాను. వారు దానిని అలాగే ప్రచురిస్తారనుకున్నా! టైపు పొరపాట్లు చాలానే జరిగాయి. కినిగెవారికి తెలియజేసాను, సరి చేస్తారని ఆశిస్తాను
      ధన్యవాదాలతో

      తొలగించండి
  2. దయగలదు నీకని తరచుగ పొగడితే
    దయపుట్టు ననుకొన్నది తప్పయ్యేనే
    జయపెట్టుచు నీముందు సాగిలపడిన గాని
    నయముగ చూడవే న్యాయమేనా ?????

    Nice lyrics !

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.