25, జనవరి 2019, శుక్రవారం

సింగపూర్ నుండి జోరుగా వ్యూస్!!


ఈ మధ్య కాలంలో శ్యామలీయం బ్లాగుకు వ్యూస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

సాధారణంగా రోజుకు మహాఐతే 50 లేదా 100 వ్యూస్ వచ్చేవేమో. వారం పది రోజులనుండి కాబోలు చూస్తున్నాను, రోజువారీ వ్యూస్ 500+ నుండి 700+ వరకూ ఉంటున్నాయి.

ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు.

ఉన్నట్లుండి ఎక్కడో సింగపూర్‍లో ఉన్న చదువరులకు ఒక తెలుగు బ్లాగుపైన అంత అభిమానం పుట్టుకొని రావటం ఏమిటో చాలా తమాషాగా ఉంది. అందులోనూ ఈ శ్యామలీయం బ్లాగులో ఉండే దేమో అంతా రామమయంగా ఉన్న సాహిత్యం. అదికూడా ముఖ్యంగా కీర్తనల రూపంలో.

ఇంకా తమాషా ఐన విషయం ఏమిటంటే రోజూ టపాలకు వచ్చే వ్యూస్ కన్నా పేజీ టాబ్‍లకు వచ్చే వ్యూస్ బాగా ఎక్కువగా ఉండటం.

ఏదో జరుగుతోంది.  మంచో చెడో మరి.

కాని ఏమిటన్నది నా చిట్టిబుఱ్ఱకు తట్టటం లేదు.

ఎవరికైనా విషయం బోధపడితే నాకు కూడా కాస్త విజ్ఞానం కలిగించే ప్రయత్నం చేసి పుణ్యం కట్టుకోవలసినదిగా విజ్ఞప్తి.


6 కామెంట్‌లు:

  1. సార్ గతంలో నాకు కూడా ఇటువంటి అనుభవం (ఉ. అల్బేనియా నుండి వీక్షణలు) ఎదురయింది. ఇది హాకింగ్ ప్రయత్నం అయి ఉండవచ్చు. సింగపూరు వరకు ఫరవాలేదు కానీ రషియా/మాజీ సోవియట్ దేశాల నుండి "దాడి" కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడడం (ఉ. Wordpress లాంటి ఇంకో platform మీద బ్లాగు సృష్టించి అందులో బాకప్ వేయడం) మంచిది.

    However there is no need for serious alarm as this type of hacking is mostly harmless.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇటువంటిది ఏమన్నా జరుగుతోందేమో అన్న అనుమానంతోనే నండీ అందరినీ సంప్రదించటం. మీ సూచన బాగుంది.

      తొలగించండి
    2. మీ బ్లాగులో కంటెంట్ ఎక్కువగా ఉంది. మామూలు పోస్టులయితే ఎలాగయినా తిరిగి వ్రాయవచ్చు. సృజనాత్మకతతో కూడిన కీర్తనలు అలా కాదు. ఎందుకయినా మంచిది జాగ్రత్త పడటం మంచిది. అసలే రాముడికి దరిద్రం ఎక్కువ( క్షమించండి) రామదాసు, అన్నమయ్య కీర్తనలన్నీ నీట మునగడమో, బూడిదవడమో జరిగాయి.

      తొలగించండి
    3. గురువు గారూ మీ పద్యాలన్నిటినీ కాస్త categorization (వర్గీకరణ?) చేసి, TOC కూడా కలిపి 5-6 సంపుటాలతో ఈ-బుక్కులుగా విడుదల చేస్తే బాగుంటుంది.

      తొలగించండి
    4. నీహారిక గారు,
      "తాళ్ళపాకకవుల సంకీర్తనల రాగిరేకులను తిరుమలదేవాలయంలో సంకీర్తనభండారంలో భద్రపరచినట్లు సాక్ష్యాలున్నవి. తాళ్ళపాకకవుల రచనల రాగిరేకులు చాలవరకు కలగర్భంలో కలసిపోయినవి. రాగం విలువ తెలియని జాతి రాగికోసం వాటిని కరగించుకొన్నది. వెంకటేశ్వరానుగ్రహం వలన మనం దక్కించుకొన్నవి కొన్నే."

      ఈ వాక్యాలు తాళ్ళపాకవారిపదసాహిత్యం సంపుటాలకు మహానుభావులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు వ్రాసిన పీఠికలోనివి.

      సంపదను గుర్తించలేకపోవటమూ భద్రపరచుకోవటమూ తెలియని జాతిది దారిద్ర్యం కాని అది రాముడి దారిద్ర్యం కాదు.

      తొలగించండి
  2. నా బ్లాగులో కూడా సేం ఫినామినా కనిపిస్తుంది సర్, కొన్నిరోజూలుగా.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.