శ్రీరామ రామ యన్నా డీజీవుడు నేడు
శ్రీరామ శరణ మన్నా డీజీవుడు నేడు
ఎన్నడు నిను విడువకుందు నన్నా డీజీవుడు
నిన్ను వినా దేవు నెఱుగ నన్నా డీజీవుడు
ఎన్నాళ్ళని వేచియుందు నన్నా డీజీవుడు
నన్ను వేగ కటాక్షించు మన్నా డీజీవుడు
ఈజీవుడు నిన్నెపుడు పూజించు చున్నాడు
ఈజీవుడు వేరెవ్వరి పూజించ నన్నాడు
ఈజీవుడు నీవాడై యిల మీద నున్నాడు
ఈజీవుడు నీకొఱకై యిల మీద నున్నాడు
పరమపామరుం డనుచు భావించ కోరామ
శరణుజొచ్చి పావనుడై వరలును గద రామ
శరణమన్న జీవునిక కరుణించరా రామ
మరల పుట్టువే లేని వరమీయరా రామ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.