9, సెప్టెంబర్ 2023, శనివారం

చెప్పుకోండి చూదాం - 2


ఐదుగురు మిత్రులు కలిసి పార్టీ చేసుకున్నారు. ఎందుకు అని అడక్కండి. మిత్రులు కలుసుకొని పార్టీ చేసుకోవటానికి కారణం అంటూ ఏదైనా ఉండాలి అనే నియమం ఏమీ లేదు కదా!

ఆ పార్టీలో ఒకరికొకరు  షేక్ హేండ్లు ఇచ్చుకున్నారు.

పార్టీలో పాల్గొన్న ప్రతీవాడూ తాను ముగ్గిరికే షేక్ హేండ్ ఇచ్చానని అంటున్నాడు.

కాని అలా జరగటం అసంభవం. వాళ్ళల్లో కనీసం ఒకరన్నా పొరపాటు పడటమో అబధ్ధం ఆడటమో జరిగింది.

ఐదుగురిలో ప్రతివాడూ సరిగ్గా ముగ్గురికే షేక్ హేండ్ ఇవ్వటం అనేది ఎందుకు అసంభవమో చెప్పగలరా?

(సమాధానం సోమవారం ఉదయం వస్తుంది. ఈలోపల మీమీ వివరణలు పంపండి. మీదే ఆలస్యం.)


5 కామెంట్‌లు:


  1. మొదటివాడు నలుగురికే షేక్ హేండ్ ఇవ్వగలడు. రెండవవాడు మొదటివాడు అప్పటికే షేక్ హేండ్ ఇచ్చుకుని ఉన్నారు గనక ముగ్గురికే షేక్ హేండ్ ఇవ్వగలడు. మిగతా వాళ్ళూ అంతే. తనకి తను షేక్ హేండ్ ఇచ్చుకుంటాడంటే, వాళ్ళు పరమానందయ్య శిష్యులే!
    దీనికి n formula లెక్క ఉంటే చెప్పండి. అది తెలియదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఐదుగురిలో ప్రతివాడు మిగతా నలుగురికీ షేక్ హేండ్ ఇవ్వగలడు కదండీ.

      ఈసంఘటనలో ప్రతివాడు తాను ముగ్గురికి మాత్రమే షేక్ హేండ్ ఇచ్చానూ అంటున్నాడు.

      తొలగించండి
    2. శ్యామలీయం10 సెప్టెంబర్, 2023 10:35 AMకి
      మొదటివాడు రెండో వాడు షేక్ హేండ్ తీసుకుంటే ఇద్దరూ తీసుకున్నట్టు కాదా? మళ్ళీ రెండో వాడు మొదటివాడికి షేక్ హేండ్ ఇవ్వాలా? ఏమో తెలీదు సుమండి. :) అలా ఐతే నలుగురికీ ఇవ్వచ్చు, తనకి తనూ ఇచ్చుకుని ఐదుగురికి ఇచ్చేననచ్చు. :)

      తొలగించండి
    3. శ్యామలీయం10 సెప్టెంబర్, 2023 10:35 AMకి
      మొదటివాడు రెండో వాడు షేక్ హేండ్ తీసుకుంటే ఇద్దరూ తీసుకున్నట్టు కాదా? మళ్ళీ రెండో వాడు మొదటివాడికి షేక్ హేండ్ ఇవ్వాలా? ఏమో తెలీదు సుమండి. :) అలా ఐతే నలుగురికీ ఇవ్వచ్చు, తనకి తనూ ఇచ్చుకుని ఐదుగురికి ఇచ్చేననచ్చు. :)

      తొలగించండి
  2. రామారావు ఆప్పారావుకి షేక్ హేండ్ ఇచ్చాడనుకోండి. అది అప్పారావు రామారావుకి షేక్ హేండ్ ఇచ్చినట్లు కూడాను. కదా! అమ్దుకని ఒకరికి షేక్ హేండ్ ఇచ్చానని రామారావూ అంటాడు అప్పారావూ అంటాడు. ఇబ్బంది ఏమీ లేదు. జరిగింది ఒక హేక్ హేండ్ ఐనా ఇద్దరూ చెప్పుకోవచ్చును ఆమాటను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.