5, సెప్టెంబర్ 2023, మంగళవారం

చెప్పుకోండి చూదాం - 1 (సమాధానం)

ఇచ్చిన పజిల్


  1.   3  V 1.5   =  4.5
  2.   5  V 1.25  =  6.25
  3.   6  V 1.2   =  7.2
  4.  9 V 1.125 = 10.125
  5.  11  V 1.1   = ?


దీనికి సమాధానం చూదాం ఇప్పుడు.


శర్మ గారు జిలేబీ గారు ప్రయత్నం చేసారు. ఒకరు కూడిక అన్నారు మరొకరు గుణకారం అన్నారు. ఈసందర్భంలో గుణకారం చేసినా కూడినా సరే సమాధానం మొదటి నాలుగు సమీకరణాల్లోనూ సరిపోతోంది.

సమాధానం చివరి సమీకరణానికి 12.1 అన్నది సరిపోతుంది. మీరు కూడినా గుణించినా సరే ఎడమవైపున సంఖ్యలను సమాధానం మాత్రం అదే.

ఐతే ఈవిశేషాన్ని ఎవరూ సరిగా గమనించనే లేదు త్వరగా. ఇంక దాని గురించి ఎవరూ వివరించే ప్రయత్నం మాత్రం ఎవరూ ఎందుకు చేయలేదన్న ప్రశ్న వేసుకోవటం అనవసరం.

ఐతే ఇలా ఎందుకు జరుగుతున్నదీ అన్నదానికి ఒక వివరణ ఉన్నది. n విలువ 1 కాని పక్షంలో

 



ఈ తమాషా సమీకరణమే పైన ఇచ్చిన పజిల్ తాలూకు విలువలకు మూలం.  మీకు చూపిన ఉదాహరణల్లో V  గుర్తును ఉపయోగించి వ్రాసినప్పుడు ఆగుర్తుకు ఎడమ కుడి వైపుల ఉన్న సంఖ్యలు పైన ఇచ్చిన సమీకరణం ఆధారంగా ఏర్పడ్డవి అన్నమాట.



మనం  n = 3 అనితీసుకుంటే ఎడమవైపున  ఉన్న సంఖ్య 3, V కి కుడివైపున ఉన్నది 3/(3-1) = 1.5. ఈ రెండు విలువలను మనం కూడినా గుణించినా విలువ ఒక్కటే  అది 9/2 = 4.5

చూపిన సమీకరణాల కన్న చిన్నది ఒకటుంది. n = 2 అనే విలువతో ఏర్పడేది.  n = 2, V కి కుడివైపున ఉన్నది 2/(2-1)= 2. 2 V 2 = 4 అంతే కదా, రెండును రెండుతో గుణించినా కూడినా మనకు నాలుగే కదా వచ్చేది!

ఒక చిన్న విషయం. మనం ధనాత్మకసంఖ్యలతోనే కాక ఋణాత్మకసంఖ్యలతోనూ ఇలా చేయవచ్చును. n = -3 అని తీసుకుంటే V కి కుడివైపున ఉన్నది -3/(-3-1) = -3/-4 = 3/4 = 0.75. మనం -౩ కు   0.75 ను కలిపినా గుణించినా వచ్చేది -2.25 అన్న సమాధానమే.

n = 0 అన్నది మాత్రం గణితపరంగా అసంభావ్యం. ఎందుకంటే1/0 అనేది అనంతం. దీన్ని  అనే గుర్తుతో సూచిస్తారు. అనంతం అనే భావనను అంకగణితం చేయటం కోసం వినియోగించరాదు. అది గణితపరంగా నిర్వచించటానికి వీలుకాని వ్యవహారం కాబట్టి.

ఇప్పుడు అంతా అందరికీ అవగతం ఐనదని భావిస్తాను.

6 కామెంట్‌లు:

  1. Good to know. This is like kuppusayyar made difficult. Not within the reach of common man.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శర్మ గారు, ఈబ్లాగులో రామకీర్తనలు/కృష్ణగీతికలు వంటివి ప్రధానంగా వస్తున్నాయి.

      అవి వెలువడటంలో నేను నిమిత్తమాత్రంగా ఉంటున్నాను. అటువంటప్పుడు నా యిఛ్చానుసారం కొంతకాలం పాటు ఏదైనా ఆపి ఉంచే అధికారం నాకేది అన్నది నా సంశయం.

      ఇకపోతే బ్లాగరు వాడు మెయిన్ పేజీలో ఎలాగూ టపాల లిష్టును చూపుతూనే ఉంటాడు కాబట్టి ఎవరికైనా ఎంతగా కొత్తవిషయం వచ్చినదీ తెలుసుకోవటం మరీ అంత కష్టం కాకూడదేమో! ఐతే పాఠలకులకు ఇతోధికసౌకర్యం ముఖ్యమే కాబట్టి ఆదిశగా కూడా కొంత ఆలోచన చేయటం అవసరం అని ఒప్పుకుంటాను. ప్రస్తుతం ఇంతవరకే ఊహ పోతున్నది.

      మాటవరసకు ఒక చిన్న సంగతి ప్రస్తావిస్తాను. అర్ధరాత్రో ఆపరాత్రో ఒక కీర్తన వచ్చినపుడు నిద్రను లెక్కచేయక దానిని గ్రంథస్థం చేయటం జరుగుతున్నది. ఆవిషయాన్ని మన్నించి విశ్వసించవలసిందిగా ప్రార్ధన. ఐతే అలా గ్రంథస్థం చేసి, దీనిని నేను తరువాత ప్రకటిస్తానయ్యా నాకారణాలు నాకున్నాయీ అని రాముడితో అనటం సాధ్యం కాదు కదా.

      తొలగించండి
  2. గమనిక:
    శ్యామలీయం బ్లాగుకు Translate అని కొత్త ఫీచర్ కలిపాను. దీని సహాయంతో తెలుగు మాతృభాష కానివారు ఈబ్లాగును తమకు కావలసిన భాషాలో చదువుకొనే సౌకర్యం ఏర్పడుతుంది. ఇదెంతవరకూ పానికి వస్తుందో నాకు తెలియదు. ఇతరభాషలు తెల్సిన వారు చూసి చెప్పవలసిందే. ఐతే ఇంగ్లీషులోనికి Translate చేసినప్పుడు ఈటపా మాత్రం సంతృప్తికరంగానే వచ్చింది. ఐతే ఈ Translate ఫీచర్ కవిత్వాన్ని Translate చేయలేదు కదా. ఎంతవరకు అర్ధవంతగా ఉంటుందో ఆవిషయంలో అన్నది ఆలోచనీయమే.

    రిప్లయితొలగించండి
  3. If that is the will of Rama,let it be. God is great. No one can cross destiny

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.