7, సెప్టెంబర్ 2023, గురువారం

నరుడా రాముని నామము మరచి

నరుడా రాముని నామము మరచి చరియించిన మోక్షము లేదు 
హరేరామ యని యనిశము బలికిన మరల నీకు పుట్టువు లేదు  

భూమిని ధనముల నరయుచు తిరుగుచు పొందలేవు శాంతిని నీవు 
రామనామమే ధనమని తెలిసిన యేమి యశాంతియు నిక లేదు  

భూమిని సంపదలుండిన నాళుల బోలెడు మందియె బంధువులు
రాముడొక్కడే నిర్ధనునకును భూమిని బంధువు రక్షకుడు

గురూపదేశము లేని మంత్రమున కొంచమైన ఫలితము లేదు
తరింపజేయును రామమంత్రము గురూపదేశము పనిలేదు1 కామెంట్‌:

  1. ఈరోజున మరొక ఉపయుక్తమైన పరికరం జతచేసాను శ్యామలీయం బ్లాగుకు. మీకు నచ్చిన పేజీని చక్కగా ప్రింటుతీసుకోవచ్చును. టపాచుట్టు ఉండే హంగామా అంత ప్రక్కనబెట్టి కేవలం టపాను మాత్రమే ప్రింటుచేసుకొనే సదుపాయం ఇది. అందరికీ నచ్చుతుందనీ ఉపయోగిస్తుందనీ ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం చెప్పండి.

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.