4, సెప్టెంబర్ 2023, సోమవారం

మారే దెట్లాగండి

మారే దెట్లాగండి వీరు కలి మాయని తెలిసే దెట్లాగు
మారకపోతే వీరి బ్రతుకులు మారేది మరియింకెట్లాగు

చేరరాని వారిని చేరుచు చెడిపోతూనే ఉంటారే
కోరరానివి కోరుచు వారిని కొరివితొ తలగోక్కుంటారే

గారడిమాయలు చేసేవారిని కలిలో దేవుళ్ళంటారే
శ్రీరఘురాముని మరచి వారికే సేవలుచేస్తూ ఉంటారే

నారాయణుని మరచి తిరిగితే నరులకు మోక్షము దొరుకదుగా
శ్రీరామనామం చేదైపోతే చేరే స్థానము నరకమెగా


7 కామెంట్‌లు:

 1. శ్యామలీయానికి చిరు ఉబోస.
  మీ బ్లాగులో టపాలకి లోటు లేదు. ఒకో రోజు ఐదారు వచ్చేస్తాయి. ఒక రోజుండవు. టపాలకి నిర్నీత సమయం ఉండదు. ఎప్పుడు ప్రచురిస్తారో తెలీదు.

  ఇక చదివేవాళ్ళకి ఏది కొత్తది,ఏది పాతది అంతా అయోమయం. ”వెంకటేశం శారదరాత్రులుజ్వల అన్నట్టుంటాయి”. ”అదేం మళ్ళీ మొదలుకొచ్చేవంటే” ”గురువుగారు చదివిన పఠం చదవని పాఠం ఒకలాగే ఉన్నాయన్నట్టు.
  చిరు ఉబోస!!!!! మీకు తోచినప్పుడు టపాలు రాసుకోండి. వాటిని బ్లాగులోనూ పెట్టుకోండి. మీరో టెకీ, రోజుకొకటో రెండో, ఒకటే ఎప్పుడూ మంచిది, ఒకే సమయానికి మూడు, నాలుగు రోజులకి ప్రోగ్రాం చేసి ఉంచండి. అవి పబ్లిష అవుతుంటాయి, గమనించండి. ఇక చదివేవాళ్ళకి ఈ రోజు శ్యామలీయం టపా రాలేదే అన్నంతగా అలవాటైపోతుంది, సమయానికి ప్రచురిస్తే. మీరొక్క సారి ప్రచురించేస్తే అవి కిందకి పోతాయి. వెతికి పట్టుకోడం సమస్యే.
  తోచింది చెప్పేసేను. ఆపై తమ చిత్తం, మాభాగ్యం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచివిషయం ప్రస్తావించారు. టపాను ఆలస్యంచేసి ప్రచురించటం వలన ఎప్పుడు వ్రాసినదీ అన్న సంగతి రికార్డు కాదండీ - అదంత ముఖ్యం అవునో కాదో అది వేరే సంగతి. ఐతే మీరన్నట్లు ఒక క్రమపధ్ధతిని వీలైనంతగా పాటించటం మంచిదే అన్నదీ నిర్వివాదమైన మాటే.

   మధ్యే మార్గంగా నాకొకటి తోస్తున్నది. ఒకటి కన్నా ఎక్కువ టపాలు వచ్చిన పక్షంలో నేటిటపాలు అన్న శీర్షికపెట్టి ఆనాటిటపాల్లో సదరుతేదీన వచ్చినవి అన్నీ ఉటంకించటం వలన ఎవరూ మిస్ కారేమో అన్న ఆలోచన. ఆలోచించి చేయాలి.

   తొలగించండి
  2. టపా రాసిన తారీకు చదువరులకు అవసరం లేదు. మీకు కావాలనుకుంటే టపా కింద తారీకు వేసుకోవచ్చు. ఈ నాటి టపాలని కొత్తగా సృష్టిస్తే...... మీ చిత్తం. చెప్పాలనుకున్నది ఏదైనా నిర్మొహమాటంగా చెప్పెస్తున్నా! మళ్ళీ మళ్ళీ చెప్పే సావకాశం వస్తుందనుకోను. చెప్పడమే నా మిత్ర ధర్మం వినకపోతే..... మీచిత్తం.

   తొలగించండి
  3. >> మీ బ్లాగులో టపాలకి లోటు లేదు.
   అవునండి. ఇప్పటికి 3200+ టపాలున్నాయి నాబ్లాగులో.
   టపాలకు లోటు లేదు కాని పాఠకులే కరువు! ఇప్పటికి వచ్చిన స్పందనల సంఖ్య 5000ల లోపే అంటే పాఠకాదరణ సంతతి తెలుస్తూనే ఉందికదా. ఐతే ఈబ్లాగులో మసాలాసరుకులు దొరుకవు కాబట్టి సంగతి అర్ధం చేసుకోవచ్చును. ఐనా ఈపన్నెండేళ్ళ ప్రయాణంలో పదకొండులక్షల వీక్షణలు లభించటం కూడా గమనార్హమైన విషయమే అనుకుంటాను. ఈ లెక్కలతో పనిలేకుండా నాపని నేను చేసుకొనిపోతూ ఉంటాను లెండి. ఆవిషయం నిస్సందేహం.

   తొలగించండి
  4. టపా క్రింద టైమ్ & డేట్ నమోదు చేసుకోవటం కూడా మీరన్నట్లు ఒక పద్దతే. అది కొన్నిసార్లు పాటించాను. మాన్యువల్ పని. శ్రమతో కూడింది..చూదాం.

   ఈనాటిటపాలు అని వేరేటపా ఉండదండీ. లేటేష్ట్ టపాలో లేదా నాటి అన్నిటపాల్లోనూ ఆవివరం ఉంటుంది. ఇదీ మాన్యువల్ పనే. శ్రమతో కూడిందే.

   చూడగా టపాతో నారికార్డు కోసం టైమ్-స్టాంప్ వేసుకోవటం తక్కువ శ్రమ.

   తొలగించండి
  5. నిర్మొహమాటంగా చెబుతున్నా! మీబ్లాగులో టపాలు చదవడమే గొప్ప. అర్ధం చేసుకోగలిగితే అదృష్టం. ఎవరో స్పందించలేదనుకోడం కానిదే! మీ ఎత్తుకు ఎదిగి టపాను అర్ధం చేసుకుని వ్యాఖ్య చేయగలవారెందరన్నది మీరు ఆలోచించడం లేదు. మీరు రాసేవి లొల్లాయిపదాలుకాదు మరొక మసలా సరుకూ కాదు. స్పందిస్తే బూతులొస్తాయి. ఇక మీరు రామార్పణంగా రాసేటపుడు ఎవరి స్పందనకోసమో ఎదురు చూడడం నచ్చలేదు, స్పందన లేదని విచారించడమూ నచ్చలేదు. చెప్పాలనుకున్నది చెప్పేసాను. స్పందనకు ఎదురు చూసే స్థాయినుంచి బయటకు రండి. ఈ వ్యాఖ్య కటువుగా ఉంది, మీరు చదువుకుంటే చాలు.

   తొలగించండి
  6. పథ్యం తీయగా ఉండాలని లేదు కదండీ. స్పందనలకోసం ఎదురుచూడటం లేదండీ. సందర్భం.వచ్చింది కాబట్టి కన్ని statistics ఏకరువు పెట్టా నంతే.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.