28, డిసెంబర్ 2021, మంగళవారం
సేవించే మాకు శుభములీవయ్య సీతారామ
27, డిసెంబర్ 2021, సోమవారం
రారా శ్రీరామా రారా జయరామా
24, డిసెంబర్ 2021, శుక్రవారం
తెలంగాణాలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధు లందరూ పాస్!
21, డిసెంబర్ 2021, మంగళవారం
దానవేంద్రవైరి యడుగో ధరణిజాసమేతు డడిగో
17, డిసెంబర్ 2021, శుక్రవారం
అహ్వానం.
వరాహమిహురుడి పంచసిధ్ధాతిక గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానం వ్రాస్తున్నాను.
ఈ వ్యాఖ్యానం ఒక ప్రైవేట్‌బ్లాగ్ రూపంలో ఉంటుంది కాబట్టి అందరకూ బహిరంగంగా కనబడదు.
భారతీయఖగోళశాస్త్రవిజ్ఞానం గురించి ఆసక్తి ఉన్నవారు ఈ వ్యాఖ్యానాన్ని నిర్మాణదశనుండి అనుగమించవచ్చును.
ఆసక్తి ఉన్నవారు తమ పేరూ, ఇ-మెయిల్ వివరాలను ఈటపాకు ఒక కామెంట్ రూపంలో పంపవచ్చును. ఈకామెంట్లను పబ్లిష్ చేయటం జరుగదు. కాని, అలా చేరిన వారికి నేరుగా ఆ బ్లాగునుండి ఆహ్వానం విడిగా అందుతుంది.
కేవల కాలక్షేపం కోసం ఎవరూ ఈవ్యాఖ్యానం కోసం చేరవద్దని మనవి. ఎవరన్నా ఆబ్లాగులో చేరి అనుచితమైన వ్యాఖ్యలను చేసిన పక్షంలో అక్కడినుండి తొలగించబడతారని గ్రహించండి. ఈవిషయంలో మొగమాటం ఉండదు.
ఇది చాలా సీరియస్ సబ్జక్ట్ ఐనా సరే సాధ్యమైనంతగా సులభంగా బోధపడేలా రచించటం జరుగుతోంది.
గణితం అంటే గాభరా ఉన్నవారికి ఇది మరీ అంత సుకరం కాకపోవచ్చును. కాని హైస్కూలు విద్యార్ధులు కూడా సులభంగా దీనిని అర్ధం చేసుకొనేలా వ్రాస్తున్నాను.
16, డిసెంబర్ 2021, గురువారం
హరిప్రీతిగ నీవేమిచేసినా వన్నది మాకు చెప్పవయా
ఘనుడు మన రాముడు ఘనుడు మన లక్ష్మణుడు
15, డిసెంబర్ 2021, బుధవారం
కథాసంవిధానం.
కథ అన్నాక దానిని నడిపేవిధానం కథ అంత ముఖ్యంగానూ ఉంటుంది. ఒక కథను అనేకులు విడివిడిగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా తమకు తోచినట్లు తాము వ్రాసారు అనుకోండి. అప్పుడు వారందరూ అదే కథనే చెప్పినా దానిని చెప్పే విధానం ఎవరిది వారికి ప్రత్యేకంగానే ఉంటుంది కదా. కథను నిర్మించే విధానాన్ని మనం సంవిధానం అందాం. ఈసంవిధానం ఎన్ని రకాలుగా ఉండవచ్చునూ అన్నది నిజానికి మనం లెక్కించను కూడా వలనుపడదు.
ఒక ఉదాహరణను తీసుకుందాం. అందరికీ తెలిసిన ఒక కథ ఉన్నది. దానిపేరు రామాయణం. ఈ రామాయణకథకు మనకు ఆధారగ్రంథం వాల్మీకి మహర్షి సంస్కృతభాషలో రచించిన శ్రీమద్రామాయణం. ఈ రామాయణం లోని కథ కల్పితమా లేక చారిత్రకమా అన్నది ఈరోజున చర్చల్లో తేలే అంశం కాదు.
ఒక్క విషయం మాత్రం ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రామాయణం కల్పితకథ ఐనపక్షంలో ఆకథ గురించీ ఆకథలోని పాత్రల గురించీ వాల్మీకిమహర్షి చెప్పినదే ప్రమాణం. ఆయన రామాయణాన్ని తప్పుపడుతూ మనం ఆపాత్రలనూకథనూ మార్చి మన వెర్షన్ మాత్రమే సరైనదనో మరింతమంచిదనో మాట్లాడకూడదు. ఒకవేళ రామాయణకథ చారిత్రకం అనుకుంటే, ఆకథను మొదట గ్రంథస్థం చేసినవ్యక్తి వాల్మీకి మహర్షి. ఆకారణంగా కూడా ఆయన రామాయణాన్ని తప్పుపడుతూ మనం ఆపాత్రలనూకథనూ మార్చి మన వెర్షన్ మాత్రమే సరైనదనో మరింతమంచిదనో మాట్లాడకూడదు. అలా రెండువిధాలుగానూ వాల్మీకి రామాయణాన్ని తప్పుపట్టటమో లేదా దానికి మనకు తోచిన మెఱుగులు దిద్దటమో అసమంజసం.
ఐనా సరే అనాదిగా కవులూ నేటి ఆధునికులూ కూడా రామకథను తమకు తోచిన రీతిలో తాము చెబుతూనే ఉన్నారు. ఈచెప్పేవాళ్ళు రెండు రకాలు. ఒకరకంవారు సంస్కృతంలో ఉన్న శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని దేశభాషల్లోని తెచ్చి మరింతమందికి అందుబాటులోనికి తేవాలని ఆశిస్తూ ఉంటారు. వీరుమరలా మూలాన్ని అనుసరించి ఉన్నదున్నట్లు వ్రాయాలనుకునే వారూ, తమప్రతిభను ప్రదర్శిస్తూ కొత్తకొత్త సంగతులు చేర్చి వ్రాద్దామనుకునే వారూగా రెండు రకాలుగా ఉన్నారు. రామాయణకథను మళ్ళా చెప్పటంలో వేరేవేరే ఉద్దేశాలు మనసులో ఉంచుకొని కథను తదనుగుణంగా చెబుతూ వాల్మీకాన్ని కావాలని అతిక్రమించి వ్రాసే వారు రెండవరకం - వీరిలో వాల్మీకాన్ని తిరస్కరించి వ్రాసే వారూ బహుళంగా కనిపిస్తున్నారు. ఇలా తిరస్కరించి దురుద్దేశంతో రామకథను వక్రీకరించే వారిని మినహాయిస్తే ఆకథ సకారణంగా సగౌరవంగా మరలా చెప్పేవారిని తప్పుపట్టుకోవలసిన పనిలేదు.
ఈ రామకథను పునఃపునః చెప్పిన వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే కదా. ఇప్పటికీ రామాయణాన్ని కవులు మళ్ళామళ్ళా చెబుతున్నారూ అంటే కథాసంవిధానం అన్నది అనంత విధాలుగా చెయ్యవచ్చును అనటానికి మనకు ప్రత్యేకంగా ఋజువులు అవసరం లేదు.
ఒక రామకథనో ఒక భారతకథనో మనం మనదైన ఆలోచనతో మనదైన శైలిలో వ్రాయాలంటే అందులో కొంత సౌలబ్యం ఉంది. ఆ సౌలభ్యానికి కొన్ని కారణాలున్నాయి.
- కథ మొత్తం మనకు ఆమూలాగ్రం మనస్సుకు చాలా స్పష్టంగా విదితంగా ఉండటం.
- కథలోని పాత్రల పేర్లూ, స్వభావాలూ పాత్రల మధ్య సంబంధబాంధవ్యాలూ స్నేహవైరాల విషయంలో చాలా మొదటినుండే చాలా స్పష్టత ఉండటం.
- కథలోని ముఖ్యఘట్టాల నుండి చిన్నచిన్న సంఘటన వరకూ వాటి క్రమమూ ప్రాథాన్యత గురించి సంపూర్ణమైన అవగాహన ఉండటం.
- కథలో ప్రస్తావనకు వచ్చే ప్రదేశాలూ వస్తువుల వంటి వాటి అవసరమూ ప్రయోజనమూ గురించి బాగా తెలిసి ఉండటం.
కేవలకల్పనాకథలు కృత్రిమరత్నములు అన్నాడొక కవి. అద్యసత్కథలు వావిరిబట్టిన జాతిరత్నములు అని కూడా అన్నాడాయన. ఆయనకో నమస్కారం పెట్టి కల్పించి ఒక పెద్దకథను చెప్పటం ఒక కత్తిమీద సాము అన్నది విన్నవించక తప్పదు. మీరొక కథను కల్పించి వ్రాసే పక్షంలో పైన చెప్పిన ఏకారణాల వలన రామాయణాదులు సులభంగా కథితం చేయగలుగుతున్నారో ఆకారణాలు మీరు వ్రాయబోయే కొత్తకథకు కూడా అంత చక్కగానూ వర్తించాలి. అప్పుడే మీరు మంచి సంవిధానంతో మీకథను చెప్పగలరు.
అదంత సులభం కాదు. మొత్తం అంతా వ్రాసేద్దామన్న అత్యాశ వదలుకొని ఒక ప్రణాళిక ప్రకారం వ్రాయటం చేయాలి.
మొదటిదశ
- క్రమంగా మీ కథను అభివృధ్ధి చేయాలి. అంటే ముందుగా మీరు వ్రాయదలచుకొన్న కథను సంక్షిప్తంగా వ్రాయాలి. కొద్ది పేజీల్లోనే అది పూర్తి కావాలి. అది స్పష్టంగా చెప్పటం ఒకపట్టాన కుదరదని గుర్తుంచుకోండి. పెద్దకథ అని అనుకున్నప్పుడు అది తృప్తికరంగా క్లుప్తంగా వ్రాయటం కూడా ఒక సవాలే. ఒకటి కాదు పదిసార్లు చిత్తుప్రతిని వ్రాయవలసి రావచ్చును.
- ఇప్పుడు మీరు పూర్తి చేసిన సంక్షిప్తకథలో ఉపకథలు ఎక్కడెక్కడ వచ్చేదీ గుర్తించండి. ఉపకథలను విడివిడిగా అభివృధ్ధి చేయండి.
- ఇలా ఉపకథలకు కూడా ప్రధానకథకు చేసినట్లుగానే సంక్షిప్తప్రతులను చేయాలి. మరలా ఆఉపకథలలో కూడా రెండవస్థాయి ఉపకథలుంటే ఇలాగే అభివేధ్ధి చేయాలి. ఇలా ఎంతలోతుగా పోవవలసి వస్తుందీ అన్నది మీకథను బట్టి ఉంటుంది.
- అట్టడుగు స్థాయి ఉపకథలను పూర్తి చేసిన తరువాత దాని పైస్థాయి ఉపకథను పూర్తి చేయగలుగుతారు. ఓపిక చాలా అవసరం. తొందరపడితే మీరు త్వరగా గందరగోళంలో పడిపోయే ప్రమాదం ఉంటుందని మరవవద్దు. ఇలా అడుగుస్థాయి నుండి పైస్థాయి దాకా ఒకసారి అభివృధ్ధి చేసిన తరువాత, మీకథకు ఒక స్వరూపం అంటూ వస్తుంది.
- అప్పుడే ఐపోలేదు. ఈప్రతిని సునిశితంగా పరిశీలించాలి. పాత్రల పేర్లూ స్వభావాలూ, సంబంధాలూ, ప్రదేశాలూ, కథలోని కాలగమనం వంటి వన్నీ బాగా అధ్యయనం చేయాలి. ఇది త్వరత్వరగా చేయకూడదు. ఇక్కడే ఎక్కువ జాగ్రత వహించాలి. అవసరం అనుకుంటే వీలు కుదిరితే మీకు సమర్ధులు అనిపించిన వారిని మీచిత్రుప్రతిని విశ్లేషించేట్లు కోరాలు. ఈ విశ్లేషకులు కనీసం ఇద్దరు ముగ్గురు ఉండటం వలన చాలా లాభాలుంటాయి.
- వచ్చిన సూచనలూ సలహాలూ దృష్టిలో పెట్టుకొని మీచిత్తుప్రతిని సవరించాలి. ఇది మరలా విశ్లేషణకు వెళ్ళాలి. ఇదంతా మొదటి దశ.
రెండవదశ
- కథను సంవిధానం చేయటం అన్నది రెండవదశ. చిత్తు ప్రతిలో అంతా కథలూ ఉపకథలూ అన్న క్రమంలో ఉంది. కాని సంవిధానం అంటే కథలను ఒకదానిలో ఒకటి జాగ్రతగా సమ్మిశ్రితం చేయటం. మొదటి చిత్రుప్రతిలో ఒక ఉపకథ ఉందంటే అక్కడ అది మొత్తంగా ఉంది. కాని చెప్పే విధానం అది కాదు కదా, ఆ ఉపకథను ముక్కలుచేసి దాని ఆధారకథలో ఎక్కడ ఎంత చెప్పాలో ఎలా చెప్పాలో అలా కలుపుతూ పోవాలి. అట్టడుగు స్థాయి ఉపకథలనుండి పైస్థాయి దాకా ఇలా చేయటం అనుకున్నంత సులువు కాదు. ప్రయత్నబాహుళ్యం అవసరం పడవచ్చును.
- ఇలా సంవిధానం చేసిన గ్రంథాన్ని విశ్లేషణకు ఇవ్వాలి. చిత్తుప్రతికన్నా ఈగ్రంథం పూర్తిగా తేడాగా ఉంటుంది కదా కధలు ఒకదానిలో ఒకటి పడుగుపేకల్లా కలగలిసి. అది ఎంత చక్కగా చదివించేలా ఉందో విశ్లేషకుల అభిప్రాయం తరువాత స్పష్టత వస్తుంది. వచ్చే విమర్శల ఆధారంగా మార్పులు చేర్పులు చేయాలి. ఇలా రెండవదశ ముగుస్తుంది.
మూడవదశ
- ఇప్పటికి ప్రథానకథనూ దానిలో అంతర్గతంగా ఉన్న ఉపకథలనూ ఒకపధ్ధతిలో పేర్చటం పూర్తయింది. కాని ఇదే తుది గ్రంథం కాదు కదా. ఇప్పుడు మూడవదశ లోనికి ప్రవేశిద్దాం. ఇంతవరకూ ఏర్పడిన గ్రంథంలో సంభాషణల స్థానంలో సంభాషణాసారం మాత్రమే కనిపిస్తోంది. సంఘటనలకు క్లుప్తంగా మాత్రమే చెప్పటం జరిగింది. ఇవి విస్తరించాలి.
- సంభాషణలను పూర్తిగా విస్తరించి వ్రాయాలి - ఏ సంభాషణ ఎంత నిడివి ఉండాలీ అన్నది సందర్భం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఒక సంభాషణలో పాల్గొనే పాత్రలను బట్టి ఉంటుంది. రెండు బండ గుర్తులు ఏమిటంటే అప్రధానసంఘటనల్లోనూ అప్రధానపాత్రలమధ్యనా సంభాషణ చిన్నదిగా ఉండాలి. ఏ సంభాషణా నిరుపయోగంగా ఉండకూడదు అన్నవి. ఇటువంటి బండగుర్తులే సంఘటనలను విస్తరించటంలోనూ ఉపయోగిస్తాయి. ఇప్పుడు గ్రంథంలో అవసరమైన చోట్ల వర్ణనలను చేర్చాలి. వీటి వలన పాత్రల స్వభావాలకు పుష్టిచేకూర్చ వచ్చును. సందర్భానికి తగిన వస్తు, ప్రకృతి ఇత్యాదులను గురించిన అవవరమైన సమాచారాన్ని పొందుపరచ వచ్చును.
- ఇలా విస్తరించి వ్రాసిన గ్రంథం మరలా బాగా విశ్లేషించబడాలి. ఎందుకంటే పాత్రల స్వరూపస్వభావాలను ఇప్పుడు మనం మన వాక్యాల్లో కాకుండా సంఘటనలూ సంభాషణలూ ఆధారంగా చదువరికి అందించుతున్నాం కాబట్టి. పాత్రలస్వభావాలు వైరుధ్యరహింతంగా నిరూపించామా, సంఘటనల్లో దేశకాలాదులను సరిగా చూపుతున్నామా అన్నది చాలా నిశితంగా విమర్శించుకోవాలి.ఇలా మూడవదశ పూర్తి ఐన తరువాత మన గ్రంథం పూర్తి ఐనట్లే.
నాలుగవదశ
- ఇక చివరిది అయిన నాలుగవ దశ. ఈదశలో కొద్దిమంది కాక ఎక్కువమంది గ్రంథాన్ని చదివి వారి వారి విమర్శలు చెబుతారు. ఎక్కువసంగతులు వెలుగులోనికి వస్తాయి. ఫలాని పాత్రకు మీరు పెట్టినపేరు బాగోలేదు అని ఒకరు చెప్పి తమతమ కారణాలను చూపించవచ్చును. ఫలాని ప్రదేశం అన్నారు అక్కడ మీరు చెప్పిన రకం పూలు పూయవు అని ఎవరన్నా ఎత్తి చూపవచ్చును. ఫలాని రెండు పాత్రలచిత్రణ అసహజంగా ఉంది. మార్చండి అని కొందరు సమర్ధనలు చూపవచ్చును. ఇలాంటివి ముందు దశల్లో రావు. అప్పటికి అంతా కథమీదనే దృష్టి కాబట్టి, కథను మాత్రమే చూపాము కాబట్టి. ఇప్పుడు గ్రంథవికాసం ఐన తరువాతనే ఇలాంటి విమర్శలు వస్తాయి.
- ఈ విమర్శలను పరిగణనలోనికి తీసుకొని గ్రంథాన్ని సంస్కరించండి. ఇప్పుడు మీకొత్త పుస్తకం విడుదలకు సిధ్ధం.
ఇంతవరకూ కథను ఎలాగు ఒక క్రమపథ్థతిలో నిర్మించాలో చూసాము.ఇప్పుడు కథలోని పాత్రలను చిత్రికపట్టటం ఎలాగో చూదాం.
కథలోని పాత్రలు ప్రధానపాత్రలు, అప్రధానపాత్రలు, ప్రాస్తావికపాత్రలు అని మూడు రకాలుగా ఉంటాయి.
- ప్రధానపాత్రలు: కథ వీటిమీద ఆధారపడి నడుస్తుంది.
- అప్రధానపాత్రలు, కథ వీటిమీద ఆధారపడి నడవదు. కాని కథను నడపటంలో తోడ్పడతాయి.
- ప్రాస్తావికపాత్రలు: కొన్ని సంఘటనల్లో ఈ పాత్రలు కనిపిస్తాయి. అలా కొధ్ది సంఘటలల్లో పాల్గొనటం తప్ప వీటి వలన వేరే ప్రయోజనం ఉండదు.
రామాయణం తీసుకుంటే దశరథుడు, సీతారామలక్ష్మణులూ, రావణుడూ వంటి వారు ప్రధానపాత్రలు. మందోదరీ, గుహుడూ వారు ప్రాస్తావిక పాత్రలు. సుమంత్రుడూ, వశిష్ఠుడు, జటాయువూ సంపా వంటి వంటి వారు అప్రధాన పాత్రలు. శత్రుఘ్నుడు కూడా ప్రాస్తావిక పాత్రగానే ఉన్నాడు. భారతంలో కృశ్ణుడు, పంచ పాండవులూ, దుర్యోధన, కర్ణ, ధృతరాష్ట్రవిదుర భీష్మద్రోణకృపాశ్వథ్థామాదులు ప్రథానపాత్రలు. మాద్రీ ద్రుపదపురోహితుడూ సంజయుడు వ్యాసుడు వంటి వారివి అప్రధానపాత్రలు. బోలెడు ప్రాస్తావికపాత్రలున్నాయి.
ఇలా మీకథలో పాత్రల పరిమితిని ముందు గుర్తించాలి.
ఒక్కొక్క సారి ప్రాస్తావిక పాత్రలు కూడా ప్రభావశీలంగా ఉండవచ్చును. రామాయణంలో మందర ఒక ప్రాస్తావిక పాత్ర. కాని ఆపాత్ర గురించి అందరికీ తెలుసు. కథలో ఒక బలమైన మలుపుకు అది కారణం ఐనది కాబట్టి. కాని వాల్మీకి సంయమనంతో ఉండి ఆ పాత్రను విస్తరించలేదు. మందరా పాపదర్శినీ అని చెప్పి ఊరుకున్నాడు. ఇలా ఏపాత్రను ఎంతమేర విస్తరించి వ్రాయాలో అన్న ఒక స్పష్టత ఉండాలి.
కథాగమనంలో తోడ్పడే అప్రధానపాత్రలను కూడ తగినంత విస్తరించటంలో ఏమరుపాటు కూడదు. లేకపోతే ఆపాత్రలు తేలిపోవటమే కాక కథాగమనంలో పునాదులు బలహీనంగా అనిపిస్తాయి. భారతంలో సైంధవుడి పాత్ర చిన్నదే. కాని తగినంత బలంగా తీర్చిదిద్దటం జరిగింది.
సంభాషణల విషయం. ఇప్పటికే ఈవిషయం క్లుప్తంగా చెప్పుకున్నాం. సంభాషణలల్లో ఒక పాత్ర స్వభావం అన్నిటా ఒకేలా ఉండాలి. స్వభావం స్పష్టంగా చదువరులకు అందాలి. అనవసరమైన సంభాషణలు ఉండకూడదు. ఒక సంభాషణ కథను నడిపించటానికి కాని పాత్రలను స్ఫుటం చేయటానికి కాని మరేదైనా సంఘటననో ఇతరవిషయాన్నో సూచించటానికి కాని ఎందుకో ఒకందుకు తప్పనిసరి కావాలి. కేవలం కాలక్షేపం సంభాషణలు గ్రంథాన్ని బలహీనపరుస్తాయి. అలాగే సంభాషణల్లో పాత్రలే కనిపించాలి కాని రచయిత కనిపించకూడదు. అలాగే సంభాషణల్లో అనుచితమైన ప్రస్తావనలూ భాషా ఉండకూడదు.
14, డిసెంబర్ 2021, మంగళవారం
ఎక్కడి సౌఖ్యం బెక్కడి శాంతము
కోరి భజించితి కోదండరామ
11, డిసెంబర్ 2021, శనివారం
శ్రీరామా జయ రఘురామా
సీతారాముడు మన సీతారాముడు
చిరుచిరు నగవుల శ్రీరామా
9, డిసెంబర్ 2021, గురువారం
బిపిన్ రావత్ & సహచర అధికారుల దుర్మరణం గురించి....
ఈరోజున ఈవిషయం ప్రస్తావిస్తూ ఈటపా వ్రాయాలని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలోనే భండారు శ్రీనివాసరావు గారి టపా వచ్చింది. దానిపై నాస్పందన తెలుపకుండా ఉండలేకపోయాను. ఆస్పందననే ఇక్కడ ప్రకటిస్తున్నాను టపాగా.
బిపిన్ రావత్ గురించి మీడియా నిరంతరాయంగా కథనాలను వడ్డిస్తూనే ఉంది.
కాని చూసారూ, ఆయనతో పాటుగా మరొక పదముగ్గురు స్వర్గస్థులయ్యారు. ఏ మీడీయాలోనూ వారి గురించిన వివరాలు కాదు కదా, కనీసం వారి పేర్లు కూడా రాలేదు.
చివరికి మీరూ కనీసం వారి ప్రసక్తి ఐనా తీసుకురాలేదు.
వారి గురించే ఆలోచిస్తున్నాను నేను. అయ్యో వారిని కనీసం స్మరించేవారు కూడా లేరే అని. కేవలం వారి వారి కుటుంబసభ్యులు స్మరించుకుంటారులే అని ఎవరూ వారిని నిర్లజ్జగా కనీసంగా ఐనా పట్టించుకొనక పోవటం దారుణాతిదారుణం!!
రావత్ గారి గొప్పదనం గురించి నేనేమీ విమర్శించటం లేదు. మిగిలిన వారిని కూడా కొంచెం స్మరించినంత మాత్రాన రావత్ గారి స్మృతికి అన్యాయం జరిగిపోదు కూడా.
ధన్యవాదాలు.
జయజయ రామా సద్గుణధామా జయజయ సీతారామా
4, డిసెంబర్ 2021, శనివారం
నీకు నాకు భలే జోడీ
ఇదే తుదిభవముగా నేర్పరించ వయ్య
29, నవంబర్ 2021, సోమవారం
నందనందను డమ్మ నవనీతచోరుడమ్మ
ఆడే నదే మీరు చూడరే
27, నవంబర్ 2021, శనివారం
రామా రామా యనరాదా
26, నవంబర్ 2021, శుక్రవారం
వెన్నమెక్క వచ్చితివా వెన్నదొంగా
హరిహరి దీనికే మనవచ్చురా
24, నవంబర్ 2021, బుధవారం
మ్రోగించరా దివ్యరాగాల మురళిని
23, నవంబర్ 2021, మంగళవారం
నామజపము చేయరే పామరులారా
పలుకరా శ్రీరామా భవబంధమోచనా
22, నవంబర్ 2021, సోమవారం
పరమానందమాయె
రామా రఘువర రాజీవాక్షా
20, నవంబర్ 2021, శనివారం
కృష్ణా కృష్ణా జయ శ్రీకృష్ణ
19, నవంబర్ 2021, శుక్రవారం
నిను దెలియ బ్రహ్మాదులును సమర్ధులు కారు
వచనకవిత్వం ఎంత సులువో!!
పుస్తకం.నెట్ సైట్‌లో ఒక కవిత్వసమీక్ష "కాలం కంపనలో కొన్ని క్షణాలు, శ్రీకాంత్ తో" చదివిన తరువాత నాస్పందన ఇది.
అక్కడ ఒక బాక్స్ కట్టి మరీ ప్రచురించిన ఒక కవితను చూడండి:
“వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేతితో
తన ముఖాన్ని తుడుచుకుంటూ
నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను
మరి
ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది
ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా –“
నిజానికి అదంతా ఒక వాక్యం. చూడండి తిన్నగా వ్రాస్తే అది ఇలా ఉంటుంది.
"వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి మసి అంటిన అరచేతితో తన ముఖాన్ని తుడుచుకుంటూ నీవైపు చూసి అప్రయత్నంగా
నవ్వుతుంది తను. మరి ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా మండుతూనే ఉండింది ఆ
కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా"
ఏమిటండీ ఈ వ్యవహారం?
ఓహో. తెలుగు వాక్యాన్ని
ముక్కలుముక్కలుగా విరిచి, ఆముక్కల్ని నిలువుగా పేర్చి వ్రాస్తే అది
ఆటోమేటిగ్గా (వచన)కవిత్వం ఐపోతుంది! ఎంత సులువూ కవి కావటమూ కవిత్వం
బరికేయటమూను!!
ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం
అంతానూ. కవి కావాలంటే గొప్ప భావాలు కలగాలీ గొప్ప వ్యక్తీకరణ ఉండాలీ గొప్ప
భాషాపటిమ ఉండాలీ అదుండాలీ ఇదుండాలీ అని.
అవేమీ అక్కరలేదూ ఎలాగో కాస్త పేరూ పలుకుబడీ వంటివి ఉండాలీ అని జ్ఞానోదయం అయింది.
ధన్యవాదాలు.
పైగా ఆ సమీక్షకు ముక్తాయింపు వాక్యం ఇలా ఉంది:
"శ్రీకాంత్ కవిత్వం కూడా పాఠకుడికి ఇంత జీవధాతువుని ప్రసాదిస్తుంది."
జీవధాతువు అంటే ఏమిటో మరి!
ఈరోజుల్లో తెలుగు కవిత్వం అంటే ఇలాగే ఉంటుందీ, ఇలా ఉంటేనే జనం ఆదరిస్తున్నారూ అనకండి. కవిత్వసంకలనాలు ఇలా సాటి కవులూ రచయితలూ మెచ్చి వ్యాసాలు వ్రాయటం వరకే తప్ప అవి జనాదరణ పొందటం లేదు.
మరొక పార్శ్వమూ ఉంది. కొన్నికొన్ని తమాషాల కారణంగా పద్యకవులూ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. శతకాలూ వగైరా జోరైనాయి. అవి కొనేవాళ్ళు కూడా ఎవరూ లేరు లెండి.
కొత్త రకం కవిత్వం పుస్తకాలైనా పాతధోరణి కవిత్వం పుస్తకాలైనా చివరకు సభల్లో పంచుతున్నరు దారిలేక పాపం వాటిని వ్రాసినవారు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే వారి సాటి కవులూ వగైరా బిరుదులున్న వారు కూడా వాటిని అక్కడే కుర్చీల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు!
రారా నవనీతచోరా
జయజయ బృందావనసంచారీ జయజయ రాసవిహారీ
వినవచ్చుచున్న దదే వేణుగానము
18, నవంబర్ 2021, గురువారం
జలధరశ్యామా రామా నీదయ చాలు నదే చాలు
17, నవంబర్ 2021, బుధవారం
మురళీ మురళీ మోహనమురళీ
మ్రోగనీ నీమురళీ కృష్ణా సాగనీ మృదురవళీ
మరియొకసారి మురళినూదరా
పరమ మధురముగను మురళిని వాయించర
16, నవంబర్ 2021, మంగళవారం
గొల్ల పిల్లోడికి పిల్లంగోవి యెందుకంటా
అల్లరి యిక చాలునురా కృష్ణా పిల్లనగ్రోవిని యూదరా
15, నవంబర్ 2021, సోమవారం
ఇంత మాధుర్యమిది యీమురళిదేనా
శ్రీరఘురామా సీతారామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనవే చిలుకా బంగారుచిలుకా
14, నవంబర్ 2021, ఆదివారం
శ్రీరామ నీనామమే చాలు
13, నవంబర్ 2021, శనివారం
ధనమదము కలవారికి దైవము మోక్షమీయడే
ఏమరక నుడువుదు నీ రామనామము
జయ జయ జయ కరుణారససాగరా రామా
రామనామం శ్రీరామనామం
11, నవంబర్ 2021, గురువారం
కొలిచెద నిన్నే గోవిందా
10, నవంబర్ 2021, బుధవారం
జానక్యాః . . . . . శ్లోకం గురించి
ఈ రోజున వాత్సల్య గారు పంపిన వ్యాఖ్య ఆలోచనీయంగా ఉంది.
శ్యామలీయం గారూ,
నిష్కర్షగా నేను-నా రాముడు అని చెప్పడం చాలా బాగుందండీ.
జానక్యాః శ్లోకం ఇంటర్నెట్లో ఒకొక్కచోట ఒకొక్కలాగ ఉంది.మీకు వీలయితే సరి అయిన శ్లోకాన్ని ఇక్కడ జవాబు ద్వారా వ్రాయగలరా?
చలామణీలో
ఉన్న ఈ శ్లోకంలో ఉన్న తప్పులని ఎత్తిచూపుతూ ఎవరైనా వ్రాయకపోయి ఉంటారేమో,
ఇంటర్నెట్లో వెతకాలి అనుకున్నప్పుడు నాకు గుర్తు వచ్చినది మీ బ్లాగు,
శర్మగారి బ్లాగే.
ఈ జానక్యాః .. శ్లోకం శ్రీరామకర్ణామృతం లోనిది.
9, నవంబర్ 2021, మంగళవారం
ముద్దుముద్దు కోపాల మురళీకృష్ణా
5, నవంబర్ 2021, శుక్రవారం
పూలదండ లీయ వస్తివా గోపికా
సరసుడవు కావటరా స్వామి
4, నవంబర్ 2021, గురువారం
కృష్ణగీతికలు ప్రారంభం.
వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా
నారాయణ నీకొఱకే నరుడ నైనాను
2, నవంబర్ 2021, మంగళవారం
హరిని భజించవె
అనుమానము నీ కక్కరలేదే
31, అక్టోబర్ 2021, ఆదివారం
నీనామ మొక్కటే నేర్చినది నాజిహ్వ
తెలియరాదు నీమహిమ దేవదేవ
28, అక్టోబర్ 2021, గురువారం
ఆకసపు వన్నె వా డఱుదైన విలుకాడు
శీతకన్ను వేయ కయ్య సీతాపతీ
రామనామ మనే దివ్యరత్నదీప మున్నది
24, అక్టోబర్ 2021, ఆదివారం
నేరములే చేసితిమి నారాయణా
16, అక్టోబర్ 2021, శనివారం
మీ రేమి యిత్తురో మిక్కిలి విలువైన
14, అక్టోబర్ 2021, గురువారం
రామయోగులము మేము శ్రీరామదాసులము మేము
12, అక్టోబర్ 2021, మంగళవారం
రామనామ సహస్రపారాయణం
రామా రామా రామా రామా రామా హరి నారాయణ శరణం
రామా రామా రామా రామా రామా పురాణపురుషా శరణం
రామా రామా రామా రామా రామా బ్రహ్మాద్యర్చిత శరణం
రామా రామా రామా రామా రామా ధరణీపూజిత శరణం
రామా రామా రామా రామా రామా సురగణవందిత శరణం
రామా రామా రామా రామా రామా దశరథనందన శరణం
రామా రామా రామా రామా రామా కౌసల్యాసుత శరణం
రామా రామా రామా రామా రామా మేఘశ్యామా శరణం
రామా రామా రామా రామా రామా సుగుణవిభూషిత శరణం
రామా రామా రామా రామా రామా సుమధురభాషణ శరణం
రామా రామా రామా రామా రామా మంగళవిగ్రహ శరణం
రామా రామా రామా రామా రామా గాధేయప్రియ శరణం
రామా రామా రామా రామా రామా కోదండధరా శరణం
రామా రామా రామా రామా రామా గౌతమపూజిత శరణం
రామా రామా రామా రామా రామా మునిమఖరక్షక శరణం
రామా రామా రామా రామా రామా తాటకసంహర శరణం
రామా రామా రామా రామా రామా హరగుణివిదళన శరణం
రామా రామా రామా రామా రామా భూమిసుతావర శరణం
రామా రామా రామా రామా రామా జగదోధ్ధారక శరణం
రామా రామా రామా రామా రామా అయోధ్యరామా శరణం
రామా రామా రామా రామా రామా వనమాలాధర శరణం
రామా రామా రామా రామా రామా భరతసుపూజిత శరణం
రామా రామా రామా రామా రామా ఖరదూషణహర శరణం
రామా రామా రామా రామా రామా మారీచాంతక శరణం
రామా రామా రామా రామా రామా జటాయుమోక్షద శరణం
రామా రామా రామా రామా రామా శబరీసేవిత శరణం
రామా రామా రామా రామా రామా కబంధనాశక శరణం
రామా రామా రామా రామా రామా హనుమత్సేవిత శరణం
రామా రామా రామా రామా రామా సుగ్రీవార్చిత శరణం
రామా రామా రామా రామా రామా వాలిప్రమథన శరణం
రామా రామా రామా రామా రామా వారిధిబంధన శరణం
రామా రామా రామా రామా రామా విభీషణార్చిత శరణం
రామా రామా రామా రామా రామా దివ్యపరాక్రమ శరణం
రామా రామా రామా రామా రామా సత్యపరాక్రమ శరణం
రామా రామా రామా రామా రామా రావణసంహర శరణం
రామా రామా రామా రామా రామా బ్రహ్మాదివినుత శరణం
రామా రామా రామా రామా రామా సురగణతోషణ శరణం
రామా రామా రామా రామా రామా త్రిజగన్మంగళ శరణం
రామా రామా రామా రామా రామా పట్టాభిరామ శరణం
రామా రామా రామా రామా రామా జగదానందక శరణం
రామా రామా రామా రామా రామా జగదాధారా శరణం
రామా రామా రామా రామా రామా దీనజనావన శరణం
రామా రామా రామా రామా రామా భక్తజనప్రియ శరణం
రామా రామా రామా రామా రామా కారుణ్యాలయ శరణం
రామా రామా రామా రామా రామా పాపవినాశన శరణం
రామా రామా రామా రామా రామా బ్రహ్మాండాధిప శరణం
రామా రామా రామా రామా రామా త్రిజగద్వందిత శరణం
రామా రామా రామా రామా రామా భవవిఛ్ఛేదక శరణం
రామా రామా రామా రామా రామా మోక్షప్రదాయక శరణం
10, అక్టోబర్ 2021, ఆదివారం
రామనామం భవ్యనామం
9, అక్టోబర్ 2021, శనివారం
మదిలో శ్రీరఘురాముని నామము మానక తలచండీ
శ్రీరాముని మనసార కొలువరే
దేవదేవ రఘురామా
దేవదేవ రఘురామా నిన్నే త్రికరణశుధ్ధిగ నమ్మితిని
నీవే శరణము సీతారామా నీవే శరణము శ్రీరామా
అనిశము దేవగణములకు ప్రీతిగ నభయం బొసగెడు శ్రీరామా
వినయాన్వితులకు విభవము గూర్చెడు వీరవరణ్యా శ్రీరామా
జననాథోత్తమ ఘనతాపహరా యినకులతిలకా శ్రీరామా
మునిగణసన్నుత సురగణసన్నుత మోక్షప్రదాయక శ్రీరామా
నిరుపమసుగుణసుశోభనశీలా నీరజనయనా శ్రీరామా
పరమదయాకర పరమశుభంకర పరమాత్మా హరి శ్రీరామా
సురవిరోధిగణశోషణభీషణ పరమపరాక్రమ శ్రీరామా
పరమేశ్వరచతురాస్యపురందరప్రస్తుతవిక్రమ శ్రీరామా
ఆదిదేవ సకలాగమసన్నుత అంబుజనాభా శ్రీరామా
నీదగు దివ్వప్రభావము నెన్నగ నేనసమర్ధుడ శ్రీరామా
పాదదాసుడను భక్తుడ నను పరిపాలించవయా శ్రీరామా
కాదనకుండగ మోక్షమునిచ్చి కరుణజూపుమా శ్రీరామా