6, అక్టోబర్ 2021, బుధవారం

శోకమోహంబు లవి నాకెక్కడివి రామ

శోకమోహంబు లవి నాకెక్కడివి రామ
నీకు బంటుగ నేను నెగడుచుండగను

సకల లోకాధార సకల ధర్మాధార
సకల జీవాధార సర్వేశ్వర
సకల క్రియలును నీదు సంకల్పములె కాన
నొక వికారము లేక యుందును నేను 

సురనాథసంస్తుత్య హరదేవసంస్తుత్య
నరనాథసంస్తుత్య నారాయణ
ధర మీద నా యునికి అరయ నీ యాన యని
హరి యెంచుకొను వాడ నంతియే కాని

మానక నీనామ మంత్రమే పలుకుచు
పూని నిన్నెప్పుడును పొగడుచుందు
నేను నీ చాయనై నిలచియుందును కాని
లేనిపోనివి తలపు లెందుకు నాకు









2 కామెంట్‌లు:

  1. లాస్ట్ లైన్ మనసు నీమీద neppudu మనుప mayya

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలా కుదరదు కదా! మీరు మీకు నచ్చినట్లు మార్చమని చెబుతున్నారని అనిపిస్తోంది. అది బాగుందదు. ఈవిషయం ఇంతకు ముందే చెప్పాను కదా.

      తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.