1, అక్టోబర్ 2021, శుక్రవారం

నేటికిని నీదయకై నిరీక్షించుచుంటిని

నేటికిని నీదయకై నిరీక్షించుచుంటిని
మాటయిచ్చి తప్పవుగా మధుసూదనా

ఇచట నావాడ వగుచు నెసగు నీవు రేపకడ
అచట కొంతకాల ముండ నరుగరాదో
యెచటనున్న నీవాడనె విచారించ నేల నని
విచలితు నన్నోదార్చి పృథివి నుంచి వెడలితివి

ఏళ్ళాయెను పూళ్ళాయెను ఎన్నో యుగములాయెను
కళ్ళజూడ నైతిని నిను కటాక్షించరా
వెళ్ళలేక వెళ్ళునన్ను వెళ్ళిరమ్మన్నది నీవు
మళ్ళీ కనిపించ కున్న మాటతప్పి నట్లేగా

నాడు నీవాడనే మరి నేడు కాకపోయితినా
వేడుకొందును దేవుడా విశ్వనాథుడా
నాడు నేడు నేనాడును నమ్మకముగ నావాడవె
గోడు వినర మాట్లాడర కోదండరాముడా


1 కామెంట్‌:

 1. 1. నీ దయ ...నిరంతరము నిరీక్షి mchu chndunu

  Nannodarchi అంతర్ధానమైtivi
  ఎన్నెన్నో యుగము లాయ
  నన్ను katakshimcharaa
  వేడుకొన్udu viswambhara vishwanaadhuda
  అని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా ను

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.