6, అక్టోబర్ 2021, బుధవారం

నేనెంత చక్కగా నినుపొగడ నేర్తునో

నేనెంత చక్కగా నినుపొగడ నేర్తునో
జానకీనాథ నా శక్తి స్వల్ప

ఆవిరించి యున్నాడే యత డెంతటి వాడు
వేవిధముల నిన్నెప్పుడు పెద్దగ పొగడు
దేవా నాకొక తలయును తెలియ వానివి నాల్గు
భావింప నాత డేమో భాషాపతియు

ఆదిశేషు డున్నాడే యత డెంతటి వాడు
మోదముతో నిచ్చలునిను పొగడుచున్నాడు
నాదొక్కటి నాల్కయైన నాగేంద్రునకు వేయి
కాదు కాదు రెండువేలు కదా నాల్కలు

హరుని మహాదేవుని గను మత డెంతటి వాడు
హరి నిన్ను లోనెప్పుడు ధ్యానించునే
హరుడు నీవు వేరే కాదని యందురు పెద్దలు
హరుని వలె నిన్ను పొగడ నన్యుల వశమె


1 కామెంట్‌:

  1. ఆ విరించి యన్న
    ఆది శేషుడ న్న
    మహాదే వు.... మత detti vaadoo
    ధ్యానించు చుండు
    వేరు కాదని పెద్ద lamdru
    అని ఉంటే బాగుంటుందని

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.