17, నవంబర్ 2021, బుధవారం

మ్రోగనీ నీమురళీ కృష్ణా సాగనీ మృదురవళీ

మ్రోగనీ నీమురళీ కృష్ణా
సాగనీ మృదురవళీ

యమునాతటిపై యదుకులభూషణ
మము మురిపించే గానమై

వెన్నెల వేళల వేడుక గొలిపే
సన్నని రాగాలాపనై

పలుకగలేని పులకితలతికలు
జలజల పూలే రాల్చగా

మనసుల కమృతమును రుచిచూపుచు
తనివి తీరని దాహమై

నందయశోదానందన బ్రహ్మా
నందము మాకందించుచు


3 కామెంట్‌లు:

 1. చాలా బాగుంది,లయలో "స్వాగతం ఇహ కృష్ణా" కీర్తన శైలి అమిరింది.

  రిప్లయితొలగించు
 2. మ్రోగనీ నీ మురళి కృష్ణా

  యమునాతటిపై యదుకుల భూషణ

  పలుకగ లేని పులకిత లతికలు

  మనసుల కమృతమును రుచి చూపుచు

  రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.