మరియొకసారి మురళినూదరా
పరమపురుష కృష్ణా
వీనులవిందుగ మురళీగానము వినితరియించితిరా
మేనున పులకలు మొలిచెనురా నీ గాన మహిమ చేత మరలమరల నీ మురళిపాటనే మనసు కోరుకొనురా
పరమమధురమగు మురళిపాటనే పరవశించి వినురా
పరమానందము కలిగించే నీ మురళిపాట వినగ
పరుగున వచ్చితి పరవశించితిని మరల పాడవయ్యా
వేణుగానమును వినివిని నాలో వేణువు మ్రోగెనురా
ప్రాణమునకు నీ వేణుగానమే ప్రాణముగా నిలచె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.