దూడలతో యశోద దుడుకుకొడుకు
హేలగా గోపాలబాలు డాడుచు నుండ
ఫాలాన ముంగురులు బలే చిందులాడ
ఘల్లుఘల్లున కాళ్ళగజ్జెలందెలు మ్రోయ
అల్లరిగా నెగురుచు నల్లపిల్లవాడు
దూడల గిట్టలచే ధూళిరేగుచు నుండ
క్రీడించుచు వాటితో కిలకిలా నవ్వుచు
పట్టి తోకలను మెలిపెట్టి యదలించుచు
ముట్టెలకు త్రాళ్ళను గట్టుచును నవ్వుచు
పెద్దగా నరచుచు పేర్లుబెట్టి పిలుచుచు
ముద్దుసేయుచు వాటి ముందు గంతులిడుచు
గంగడోళ్ళు నిమురుచు గారాబము సేయుచు
చెంగుమని పైకెక్కి చేత నదిలించుచు
పరువులెత్తు దూడల పదేపదే యడ్డుచు
చిరుకోపము జూపుచు చెవులబట్టి గుంజుచు
అంభారవముల తాననుకరించుచు వేడ్క
శంభుడన వాటిపై చాల శోభిల్లుచు
శ్రీ కృష్ణలీలలు కీర్తన ద్వారా చాలా బాగా వర్ణించారు 👌👌🙏
రిప్లయితొలగించండిచాలా బాగుంది కీర్తన
రిప్లయితొలగించండివిజయ