శుభోదయం.
ఈరోజునుండి కొత్త శీర్షిక ఒకటి మొదలుపెడుతున్నాను. కృష్ణగీతికలు అన్నపేరుతో. దీని అర్ధం రామకీర్తనలకు మంగళం అని కాదు. అవీ ఇవీ కూడా నడుస్తూ ఉంటాయి.
రామకీర్తనలు ఈనెలకో పైనెలకో 1500 సంఖ్యకు చేరుకుంటాయి. కృష్ణగీతికలు కొత్తగా మొదలౌతున్నాయి కాబట్టి అంచనాలు లేవు. వీలుంటే ఒక వేయైనా వస్తాయనుకుంటాను. ఇది నా పేరాశ కావచ్చును.
మొదటి కృష్ణగీతిక ఈ క్రింది పల్లవితో వెలువడింది.
వెన్నెల వేళలో కన్నయ్యా నువ్విలా
పొన్నచెట్టెక్కి మధుర మురళి ఊదకు
రామకీర్తనలతో పోల్చితే కృష్ణగీతికలు కొంచెం భిన్నత్వాన్ని పాటించవచ్చు లక్షణంలోనూ సరళత్వంలోనూ. రామకీర్తనలు సంకీర్తనసంప్రదాయానికి అనుగుణంగా యతిప్రాసలతో కొంచెం గంభీరమైన భాషతో ఉంటున్నాయి కదా. కృష్ణగీతికల భాష మరింత వ్యవహారశైలిలో ఉండవచ్చు, యతిప్రాసలు ఐఛ్ఛికంగా పాటించబడవచ్చును - ఈవిషయంలో కొంతదూరం సాగితే కాని మరింత స్పష్టత రాదని అనుకుంటున్నాను.
ఒక ముఖ్యవిషయం. కొన్ని కృష్ణగీతికలు రామకీర్తనలుగా కూడా లెక్కించబడే అవకాశం ఉంది.
శ్యామలీయం పాఠకు లందరకూ దీపావళీపర్వదినం సందర్భంగా అనేక శుభాకాంక్షలు.
మంగళం కోసలేంద్రాయ
రిప్లయితొలగించండిమహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళం.....
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరెంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్త హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెద ద్రుపవే భవలతల్ నిత్యానుకంపనిధీ!
మిత్రులు శర్మ గారు,
తొలగించండిమంగళానుశాసనం చేసారు చాలా చక్కగా.
ధన్రవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిKrishnam vande jagadgurum.
రిప్లయితొలగించండి