2, నవంబర్ 2021, మంగళవారం

అనుమానము నీ కక్కరలేదే

అనుమానము నీ కక్కరలేదే
మనసా రాముడు మనవాడే

సుజనుల నేలే సొంపు గలాడు
కుజనుల నణచే గోవిందుడు
విజయశీలుడు వీరవరేణ్యుడు
నిజముగ రాముడు నీవాడే

త్రిజగద్వంద్యుడు దేవదేవుడు
భజితసురేంద్రుడు పరమాత్ముడు
నిజభక్తజన నిత్యపోషకుడు
నిజముగ రాముడు నీవాడే

పరమమధురమును భవతారకము
నరయగ రామా యను నామము
స్మరియించగదే మరిమరి మనసా
తరియించగదే తప్పకను


1 కామెంట్‌:

  1. హక్కులకంటే కూడా బాధ్యత గొప్పది: శ్రీరామ
    కష్టాలలో ఆలుమగలు ఒకరికొకరు తోడు నీడ: సీతమ్మ
    కుటుంబ బాధ్యతలు కుటుంబ సభ్యూలు పంచుకోవచ్చు: లక్ష్మణ
    ఒకరి పట్ల వినయ విధేయతలు నమ్మిక ఒద్దికలే శ్రీరామరక్ష: ఆంజనేయ

    రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.