29, డిసెంబర్ 2019, ఆదివారం

అమరావతి విధ్వంసం తగదు పై వ్యాఖ్య


ఆంధ్రా అనేది ఒక తమాషా బజార్
దీన్ని ఒక తమాషా కేంద్ర ప్రభుత్వం ఏర్వాటు చేసింది
అదీ ఒక తమాషా రాష్ట్ర విభజన నాటకంతో
ఒక రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధాని అంది
ఒక తమాషా కేంద్రప్రభుత్వం గుప్పెడు మట్టిని బహుమానంగా ఇచ్చింది
కొన్నాళ్ళపాటు ఆపసోపాలతో రాజధాని నిర్మాణం నడిచింది
మరొక రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది
అమరావతి కాదు అనేక రాజధానులు అంది.
రేపు మరొక ప్రభుత్వం వస్తుంది
అన్ని రాజధానులేమిటి అంటుంది
అప్పటికి ఉన్నవి అన్నీ మట్టి కొట్టుకొని పోతాయి
అమరావతి వెనక్కి వస్తుంది వీలైతే
లేదూ మరొక రాజధాని పేరు వినిపిస్తుంది.
ఆభోగం అంతా మరలా ప్రభుత్వం మారే వరకే
లేదా ఆంధ్రా మళ్ళా ముక్కలయ్యే వరకే
అప్పుడు తమాషా మళ్ళా మొదలౌతుంది
ఒకటో రెండో మూడో రాజధాని లేని రాష్ట్రాలు వస్తాయి
రాజధాని వెదుకులాటలు మొదలౌతాయి
ఒకటి కన్న ఎక్కువ తమాషాలు అన్నమాట
జనం చూస్తూనే ఉంటారు తమాషాలను
అంత కన్నా ఓట్లేసి మునగటం కన్నా ఏం చేయగలరు పాపం.


[ నేటి వనజవనమాలి బ్లాగు టపా అమరావతి విధ్వంసం తగదుపై నా స్పందన.]

39 కామెంట్‌లు:

  1. Why can't we have capital in one city for 5 years and then let the next government decide where it should be. This way I think every city in AP might get a chance to host the capital for few years (or it can even be in a round robin fashion), if not for 5 years :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఐదేళ్ళకో రాజధాని అని ఏముంది లెండి. నెలకో రాజధాని అనుకుంటే బోలెడు వస్తాయి కదా. ఆవీ చాలవనుకుంటే పక్షానికి ఒకటి అంటే సరి. జిల్లాకు ఒకటి చొప్పున పంచిపెట్టవచ్చును. విభజన నాటినుండే అంధ్రప్రాంతం వేళాకోళాలపాలు ఐపోయింది కదా. ఇంకా ఏమేమి కావలసి ఉందో మరి, అదీ చూదాం.

      తొలగించండి
  2. మూడు రాజధానులు అనగానే ఆహా ఓహో అంటూ గుడ్డిగా మెలితిరిగిపోయే జనాలు ఒక్కసారి ప్రపంచపటం చూసి ఎన్ని న్యూయార్కులు ఎన్ని లండన్ లు, ఎన్ని టోక్యోలు, ఎన్ని పారిస్ లు ఉన్నాయో తెలుసుకుంటే బావుంటుంది.
    అధికార వికేంద్రీకరణ అంటే ఒక్కో ఆఫీసు ఒక్కొదగ్గర పెట్టడం కాదు. అధికార కేంద్రం ఒకదగ్గర ఉంటూనే లోకల్ అథారిటీస్ కి తగిన నిర్ణయాధికారాలు అందజేయడం.
    అయినా రాజధాని భూముల్లో అవినీతి ఉంటే తగిన ఆధారాలతో నిరూపించి చర్యలు తీసుకోవాలి. అది వదిలేసి కొత్తగా అవినీతికి అవకాశాలు వెతుక్కుంటున్నట్లే ఉన్నాయి ప్రభుత్వ చర్యలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. // "అధికార వికేంద్రీకరణ అంటే ఒక్కో ఆఫీసు ఒక్కొదగ్గర పెట్టడం కాదు." //

      హ్హ, హ్హ సూర్య, బాగా చెప్పారు. కాన్సెప్ట్ మీద సరైన అవగాహన లేకపోతే వచ్చే తిప్పలు.

      నా ఉద్యోగ కాలం నాటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది. బ్యాంకుల్లో Single Window Operator అనే system ఉంటుందని ఈ రోజు మీకందరికీ తెలుసుగా. ఆ కాన్సెప్ట్ వచ్చిన కొత్తలో (ఇండియాలోని బ్యాంకుల్లో) ఒక బ్యాంకులో జరిగిందిది. హైదరాబాద్ లోని ఒక చాలా చాలా పెద్ద బ్రాంచ్ లో ఈ system వెంటనే అమలు చెయ్యాలని పై నుండి హుకుం వచ్చింది. బ్రాంచ్ లో ఆఫీస్ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తిని పిలిచి రేపటి నుండీ అమలు చెయ్యాలని, వెంటనే తగిన ఏర్పాట్లు చెయ్యమని బ్రాంచ్ మేనేజర్ గారు చెప్పారు. ఎస్ సార్ అని తలూపి వెళ్ళాడు. మర్నాడు స్టాఫ్ వచ్చినప్పుడు కనిపించిన scene .... మామూలుగా 40, 45 కౌంటర్లతో నడిచే ఆ బ్రాంచ్ లో ఒక్క కౌంటర్ మాత్రం తెరిచుంచి మిగిలిన అన్ని కౌంటర్లనూ మూసి వేసాడు ఆ ఆఫీస్ మేనేజర్ గారు. ఆ ఒకే ఒక్క కౌంటర్ ముందు Single Window అని బోర్డ్ తగిలించాడు. దాని ఎదురుగా అప్పటికే జనం కిక్కిరిసి పోతున్నారు. ఇదేమిటయ్యా అని అడిగితే Single Window system సార్ అన్నాడు. అదీ ఆ system / concept మీద వారికున్న అవగాహన, ప్చ్.ప్చ్. 😂🤣🤣

      తొలగించండి
  3. శ్యామలరావు గారు,
    ఈ చంద్రబాబు vs రాజధాని అంశం మీద నా అభిప్రాయాలను బ్లాగుల్లో వెలిబుచ్చుదామని చాలా సార్లు అనుకునేవాడిని గానీ ... మళ్ళీ ఎందుకొచ్చిన రొష్టులే అని ఊరుకున్నాను. కాని ఇప్పుడు కాస్తైనా చెప్పాలనిపిస్తోంది.

    మొదటి సంగతి ... అమరావతి విషయంలో చంద్రబాబు గారిని (CBN) నిందించడం అన్యాయమని నేను భావిస్తాను (Disclaimer : నేను చంద్రబాబు గారి కులానికి చెందినవాడను కాను). ఐదేళ్ళల్లో రాజధానిని కట్టడంలో ఏమీ పురోగతి లేదని అనడం మామూలయిపోయింది. నా మనవి ఏమిటంటే కట్టడానికి పూర్తి ఐదేళ్ళ కాలం CBN గారికి లభించలేదు అని మనమంతా గ్రహించాలి. కట్టడానికి ముందు చెయ్యవలసిన spadework ఎంతో ఎంతో ఉంది. అదంతా టైము పట్టే వ్యవహారం. మచ్చుకి ... (1). అమరావతి అని తేల్చుకోవడానికి కొంత కాలం పట్టింది. (2). ఆ తరువాత ముఖ్యమైన పని భూసేకరణ. చేతిలో డబ్బులు లేవు కాబట్టిన్నూ, నిధులు ఇవ్వవలసిన వారు దోసెడు మన్ను, ముంతడు నీళ్ళతో సరిపెట్టారు కాబట్టిన్నూ భూమి ఎలా సంపాదించాలి అన్నదానికి మార్గాలు వెతకాలిగా. ఆ రకంగా శోధించి చివరకు "లాండ్ పూలింగ్" అనే పద్ధతిని ఖరారు చేసుకోవడానికి కొంత కాలం పట్టింది. (3). ఈ "లాండ్ పూలింగ్" పద్ధతికి రైతులను, ఇతర భూస్వాములను ఒప్పించాలిగా. దానికీ టైము కావాలిగా. (4). భూములు ఇచ్చిన వారి దగ్గర నుండి సంతకాలు చేయించుకోవడానికి తగిన లీగల్ డాక్యుమెంట్ న్యాయ నిపుణుల చేత తయారు చేయించాలిగా. అలా తయారు అయిన డాక్యుమెంట్ ను ఒకటికి రెండు సార్లు కూలంకషంగా పరిశీలింపచేయాలిగా (vetting). (5). సరే, లాండ్ పూలింగ్ తరువాత కార్యక్రమం అయిన బిల్డింగులు కట్టడానికీ డబ్బులు లేవు కాబట్టి, కేంద్రం నుండి పేకేజీ కోసం ప్రయత్నించడం. ప్రణాళికలు తయారు చెయ్యడానికి విదేశీ సంస్ధలను సంప్రతించడం చేశారు. దాని చర్చల నిమిత్తం (plans / designs) ఒకటికి నాలుగు సార్లు విదేశీ పర్యటనలు, వారిని ఇక్కడకు పిలిపించడం చెయ్యవలసి వచ్చిందిగా? పైన నేను కొంచెం టైము పడుతుందిగా అంటే ఏదో రెండు మూడు రోజుల్లోనూ, చిటికెలేస్తే అయిపోతాయనీ కాదు. ఈ కార్యక్రమాలన్నీ ఒక కొలిక్కి వచ్చేటప్పటికి మూడు సంవత్సరాలు గడిచిపోలా? (6). ఈ లోగా .. పదేళ్ళు ఉమ్మడి రాజధాని అని చట్టంలోనే ఉంది కాబట్టి తొందర పడకుండా మంచి రాజధాని కోసం ప్రణాళికలు తయారు చేయడంలోనూ నిమగ్నమయ్యారు. కానీ జరిగిందేమిటి ... వెళ్ళిపొండి వెళ్ళిపోండి అంటూ పొగ బెట్టినట్లు వేధింపులు ఎక్కువయిపోయాయి. దాంతో ప్రాణం విసుగొచ్చి ఆత్మగౌరవం వల్ల కొన్ని శాఖలను తరలించడం, వాటికోసం కొన్ని బిల్డింగులు కట్టడం/వెతుక్కోవడం చెయ్యవలసి వచ్చింది CBN గారికి.

    కర్ణుడి చావుకి కారణాల లాగా ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ వ్యవహారాలను ఒక దశకు తీసుకొచ్చేటప్పటికే CBN గారికి పుణ్యకాలం కాస్తా దాదాపు గడిచిపోయింది. మిగిలిన వ్యవధిలో చెయ్యగలిగినంత చేసాడు. రెడీగా ఉన్న జాగా మీద రెండంతస్తుల ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికే దాదాపు సంవత్సరం పడుతుంది కదా, మరి భూమి సేకరించి రాజధాని బిల్డింగుల లాంటివి కట్టడమంటే ఆషామాషీనా?

    CBN చేసింది ఏమిటి, "శ్మశానం", "ఎడారి" లాగా వదిలెయ్యడం తప్ప అని CBN గారి గురించి ఈ నాడు ఎద్దేవా చెయ్యడం తేలికయిన పనే. చేసిన వాడికి తెలుస్తుంది దానిలోని సాధక బాధకాలు. ఇవన్నీ తెలియక కాదు, ఇప్పుడు జరుగుతున్న రగడకు ముఖ్య కారణం రాజకీయ కక్ష సాధింపేనని అందరికీ తెలుస్తూనే ఉంది.

    రెండవ సంగతి .... CBN గారి హయాంలో అవినీతి పెచ్చుమీరి పోయిందేమో తెలియదు. నిజానిజాలు తేలిస్తేనే గానీ చెప్పలేరు ఎవరయినా. కానీ నేను ఒకటి మాత్రం నిస్సంశయంగా చెప్పగలను .... CBN గారి లాంటి అనుభవజ్ఞుడికి ఈ సారి కూడా అవకాశం ఇచ్చుంటే (for the sake of continuity and completion) ఒక స్టేజీకు లాక్కొచ్చిన పనులు పూర్తయ్యుండేవేమో, పడిన శ్రమకు ఫలితం కనిపించేదేమో? రాష్ట్రం పురోగతి మరోకలా ఉండేది అనిపిస్తుంది. ప్చ్, జనాలు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు అని చెప్పక తప్పదు ... నా దృష్టిలో.

    పైన నేను చెప్పిన దానితో ఏకీభవించనివారు మన బ్లాగులోకంలోనే ఉన్నారని తెలుసు. నేను oversimplify చేస్తున్నాను అని నవ్వుకునేవారూ ఉండవచ్చు. నేను వారంత మేధావిని కాకపోయినా ఒక సామాన్యమానవుడిగా నా అభిప్రాయం అయితే ఇదీ. మీరన్నట్లు రాష్ట్రం నవ్వులపాలవుతోందే అనే విచారం కూడానూ. 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. I agree with your opinion.
      Foundation also laid for Secretariat buildings.
      When we build a capital, we have to think 100 times. We can't change latter. Unfortunately people didn't understand that.

      తొలగించండి
    2. @విన్నకోట నరసింహా రావు
      మీ అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తాను.
      మీరన్నట్లు చంద్రబాబు రాజధాని, భవనాల వెతుకులాట విశాఖలో చేసుంటే ఇన్ని బాధలు ఉండేవి కాదు.
      అమరావతి పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజధానిని కట్టాలి అనుకోవడం, దానిలో తన సామాజిక వర్గాన్ని కుర్చోబెడదాం అనుకోవడం పిచ్చి పని కాక మరేంటి ..
      చంద్రబాబు అనుభవజ్ఞుడు అన్నీ సక్రమంగా చేస్తాడని మీలాంటి వారు "కళ్ళు మూసుకున్న పిల్లి లాగా" అనడం విచారకరం

      తొలగించండి
    3. అయ్యా అజ్ఞాత గారూ,
      మీ రాజకీయ వ్యాఖ్య ఇక్కడ పూర్తిగా అసందర్భం!
      చంద్రబాబు విశాఖను రాజధానిని చేస్తే జగన్ అది తప్పు విజయవాడ అనే వాడు లెండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్కెడెక్కడి రెడ్లనూ పిలిచి పదవులిస్తోంది. వాళ్ళంతా అపదవులకు నిజంగా అర్హులే అని మీరు నమ్మవచ్చును కాని అందరినీ నమ్మించలేరు. చంద్రబాబు అదే చేసాడని తప్పుపట్టే మీకు ఈ ప్రభుత్వం దానిని పదిరెట్లు ఎక్కువగా చేయటం కనిపించటం లేదు కదా. ఎవరు కళ్ళుమూసుకున్నదీ ఈవిధంగా బాగానే తెలుస్తున్నది కదా. ఇంకేమీ మీ రాజకీయవిజ్ఞానవీచికలను ఇటు ప్రసరించకండి మీరు. ధన్యవాదాలు. సెలవు.

      తొలగించండి
    4. @శ్యామలీయం
      మీ వ్యాఖ్య ఏవిధంగా సందర్భోచితమో చెప్పగలరా?

      "ప్రభుత్వం ఎక్కెడెక్కడి రెడ్లనూ పిలిచి పదవులిస్తోంది" .. ఏమిటీ అనవసర ప్రస్తావన?
      ఖచ్చితంగా చంద్రబాబు చేసిన తప్పులే ఈ రాజధాని మార్పుకి కారణం

      "ఇంకేమీ మీ రాజకీయవిజ్ఞానవీచికలను ఇటు ప్రసరించకండి మీరు. ధన్యవాదాలు. సెలవు."
      అంటే చంద్రబాబుని ఏమీ అనవద్దని మీ హెచ్చరికా???

      తొలగించండి
    5. టపాకు సంబంధం లేని సామాజికవర్గాల ప్రసక్తి తెచ్చింది తమరే నండీ అజ్ఞాత గారూ. ఆ మాటను నేను త్రిప్పికొట్టటం మాత్రమే చేసాను. మీకు హెచ్చరికలు చేయటం కాదు, అసందర్భంగా రాజకీయపక్షపాతాలు ప్రస్తావించ వద్దని చెప్పానంతే. జవాబు ఇవ్వటం సందర్భోచితం అని నేను ఊరూపేరూ చెప్పుకోలేని మీకు ఋజువుచేసుకోవాలా. పిచ్చిమాట. చాలించండి.

      తొలగించండి
  4. శ్యామలరావు గారు,నా
    తెలియక అడుగుతున్నాను. రాజధాని మార్పుకి కేంద్రం ఒప్పుకోవాలేమో కదా ?
    ఆర్టీసీ సమ్మె వల్ల జనాల జేబుకి చిల్లు పడి 5 రూ టికెట్ 10 రూ చేసినా ఒక్కరూ నోరెత్తలేదు.
    రాజధాని మార్పు ప్రకటనకి మీడియాలో ఉన్న స్పందన బయట లేదు.
    కేసీఆర్, జగన్ లు దేవుళ్ళు.
    సమస్యలూ వాళ్ళే సృష్టిస్తారు.పరిష్కారాలూ వాళ్ళే చూపిస్తారు.
    పండగ సీజన్ లో సమ్మె చేసారని ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహించి రేట్లు పెంచేసి అనుగ్రహించారు.

    లోకేష్ బాబు అమరావతిలో పొలాలు కొన్నారని రాజధాని మార్పు ప్రకటన చేసి మిగతా ప్రాంతాలను అభివృద్ధి పరిచి అనుగ్రహిస్తున్నారు.

    భగవంతుని లీలలను అర్ధం చేసుకోవాలి కానీ మీలాంటి వారు అగ్రహించకూడదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "రెడ్డొచ్చె" మొదలాడు అని సామెతే ఉంది కదా.
      తనకి ఉన్న ఐదేళ్ళ కాలవ్యవధిలోనూ అధికస్య అధిక భాగం భూసేకరణలోనూ ఇతర సంబంధిత పనులను చక్కబెట్టడంలోనూ గడిచిపోయింది CBN గారికి. Working from scratch పరిస్థితి కదా CBN గారికి. తర్వాత వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఆ శ్రమ, టైం వేస్టు లేకుండా అన్ని వేల ఎకరాల భూమిని రెడీగా ఉంచి వెళ్ళాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందీ ... భూమి రెడీగా ఉన్నచోట నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించకుండా, వేరే చోటికి వెళ్ళి అక్కడ మళ్ళీ భూసేకఠణ మొదలెడతామంటూ ... పై సామెతను నిజం చేస్తున్నారు.

      తొలగించండి
    2. రాజధాని మార్పుకి కేంద్రం ఒప్పుకోవాలంటారా? ఒప్పుకోకపోతే ఒక కమిటీ వేసి ప్రథానమంత్రిని దోషిగా తేలుస్తారు. ఆయన్ను జైలుకు పంపుతారు. ఏమనుకున్నారో!!

      తొలగించండి
    3. వీ ఎన్ ఆర్ గారూ,
      మీ కమెంట్ ని షేర్ చేయవచ్చా ?

      తొలగించండి
  5. థాంక్స్ నీహారిక గారు. ఏదో కంఠశోష / బ్లాగుశోష.

    రిప్లయితొలగించండి
  6. బహుళ రాజధానుల గురించి ఇందాకే వచ్చిన ఒక వాట్సప్ జోక్👇. నాకయితే బాగా నచ్చింది 🙂.
    ———————
    Forwarded
    “ ఆంధ్రా పొడవునా సముద్రం వుంది కాబట్టి, అసెంబ్లీ మరియు ప్రభుత్వ కార్యాలయాలు ఒక రెండు పెద్ద టైటానిక్ లాంటి షిప్స్లో పెట్టి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నెలకు ఒకసారి అటూ ఇటూ తిప్పితే, రాజధాని అందరి దగ్గరకూ వచ్చినట్టుంది ప్లస్ ఒక ఫ్లోటింగ్ కాపిటల్గా ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. ఎవరి భూములూ, రియల్ ఎస్టేట్లు అవసరం లేదు. ఏమంటారూ??? “
    ———————-

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విభజన నాటినుండే అంధ్రప్రాంతం వేళాకోళాలపాలు ఐపోయింది కదా అన్న మాట చెప్పాను కదండీ. ఏడవలేక మన మీద మనమే చతురులు విసురుకోవటం జరుగుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.ఆ చతురుల్లో ఇదొకటి ఫ్లోటింగు రాజధానులూ రావచ్చును ఫ్లైయింగు రాజధానులూ రావచ్చును. కాదనటానికి మనం ఎవరం లెండి.

      తొలగించండి

    2. అబ్బబ్బా ! రాజధాని మీద ఇంత చర్చలేల ? రాజధాని కావాల్సింది రాజులకు గాని, సామాన్య ప్రజలకు కాదుగా ? వాళ్లు వాళ్లు తేల్చుకుంటారు ంంంం మన కెందుకండీ అవన్నీను ?



      ఆమ్ నాగరిక్
      జిలేబి

      తొలగించండి
    3. రాజధాని కావలసింది ప్రజలకే. రాజులకు వాళ్ళింటి నుండే పాలన నడిపించాలని ఉంటుంది.

      తొలగించండి
  7. ఎవరికి నచ్చింది వారు చెప్పారు, ఇందులో ఎటువంటి ఆక్షేపణ లేదు. నా వ్యాఖ్య టపా గురించి కానీ దానికి కారణభూతమయిన రాజకీయ పరిస్థితుల గురించి కానీ కాదు.

    విన్నకోట వారు పెద్దలు, నన్ను మన్నించాలి. మీరు రాసిన వ్యాఖ్యలలో దిగువ పేర్కొన్న రెండు విషయాలు మీ స్థాయిలో ఉన్నట్టు లేవు. ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్త పడుతూ రాసే పెద్దలు తన సొంత ఉన్నత ప్రమాణాలను కాస్త పక్కన పెట్టినట్టు అనిపించడం మూలానే నా వ్యాఖ్య.

    1. ""రెడ్డొచ్చె" మొదలాడు అని సామెతే ఉంది కదా": ఇతర కులస్తులు మీకు నచ్చనివి చేస్తే మీరు ఇదే నాటు సామెత వాడుతారో లేదో తెలువదు. అసలే కొందరు మీడియా వాళ్ళు "జగన్ రెడ్డి" అని నొక్కి వక్కాణిస్తున్న తరుణంలో ఈ పదప్రయోగ ఔచిత్యం పునర్దర్శిస్తే బాగుంటుంది.

    2. "శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నెలకు ఒకసారి అటూ ఇటూ తిప్పితే, రాజధాని *అందరి* దగ్గరకూ వచ్చినట్టుంది": నాలుగు సీమ జిల్లాలు తీరప్రాంతంలో లేవని సదరు అనామక "సామాజిక" మీడియావాలాకు తెలియకపోవొచ్చును, తెలిసినా అసువంటి వాళ్లకు వాస్తవాల పట్ల పట్టింపు ఉంటుందని అనుకోను. జగమెరిగిన మీరు "ఆంధ్ర = కోస్తా" ట్రాపులో పడినట్టు అనిపించే విధంగా మీ వ్యాఖ్య ఉండడం కించిత్తు దురదృష్టం.

    This is not a criticism please

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకా మీరు రాలేదేమిటా అనుకున్నా జై గారూ వచ్చారా. సంతోషం.

      టపాను ఉద్దేశించని వ్యాఖ్యలు అస్థానపతితాలు. వాటిని ప్రచురించటం అంత మంచిది కాదనే నమ్ముతాను.

      రెడ్డొచ్చె మొదలాడు అన్న సామెత వెనుక ఏకులాన్నీ అక్షేపించటం అన్నది లేదు అలా అనుకోవటం అతి అనిపించుకుంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో ఈ సామెతనే ఒకానొక రెడ్డిగారే వాడటం కూడా విన్నాను మరి. సామెత చెబుతున్న తాత్పర్యం పైనే జనదృష్టి కాని రెడ్డి అన్నమాట పట్టుకొని రగడలూ రాజకీయాలూ చేయటం ఉచితం కాదు.

      మీ రెండవ ఆక్షేపణ కూడా అంత ఉచితంగా లేదు. మాటవరసకు అందరికీ అందుబాటులో అంటూ ఎవరన్నా ఏదన్నా ప్రస్తావిస్తే దానిని సాగతీసి ఫలానాసౌకర్యం అన్ని గ్రామాల్లోని అన్ని పేటల్లోనూ పెట్టలేదు కదా, వృధ్ధులూ దివ్యాంగులూ నడిచి రాలేరు కదా వారికి అందుబాటులో లేదు కదా అంటూ మీబోటి వారు మొదలు పెడతారన్నమాట. ఇక్కడ అందరు అన్నమాట వెనుకభావాన్ని రంద్రాన్వేషణ కోసం వినియోగించకండి దయచేసి.

      విన్నకోటవారి వ్యాఖ్యలు హుందాగానే ఉన్నాయి. వారి ఏదో ట్రాప్‍లో పడ్డారని విచారించే ముందు మీరు స్వయంగా దీర్ఘకాలంగా ఆంద్రవిద్వేషం అనే ట్రాన్స్ లో మునిగి ఉన్నారన్న సత్యం తెలుసుకోలేక పోతున్నారు.

      తొలగించండి
    2. "తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ" అన్నందుకు థాంక్స్ గురువు గారూ.

      మీరు & విన్నకోట వారు చంద్రబాబు లేదా టీడీపీ సమర్థకులు. అది మీ ఇష్టం, అభ్యంతరం చెప్పడానికి నాకేమీ హక్కు లేదు.

      "ఎక్కెడెక్కడి రెడ్లనూ పిలిచి పదవులిస్తోంది" అని మీరన్నప్పుడు ముఖ్యమంత్రి గారిపై స్వకులపక్షపాత ఆరోపణ నేరుగానే ఉంది (WYSIWIG). వాస్తవిక తప్పొప్పుల జోలికి వెళ్లకుండా మీ ఉద్దేశ్యం మాత్రం స్పష్టం. విన్నకోట వారి వ్యాఖ్యలలో ఇందుకు భిన్నంగా unintended semantic.

      రెడ్డొచ్చె మొదలాడు అనే నానుడి అందరూ వాడతారు, ఏమీ ఆక్షేపణ లేదు. విన్నకోట వారి అభిమతం ముఖ్యమంత్రి గారి కులాన్ని గుర్తు చేయడం కాదని అనుకుంటా. ఇక్కడ ఆ సామెత వాడడం deviating from his own high standards అవుతుందేమోనని అనిపిస్తుంది తప్ప విమర్శ కాదు.

      ఇక "తేలుతున్న రాజధాని" అనేది ఒక సెటైర్. తీరానికి అత్యంత దూరంలో ఉన్న సీమ ప్రజలకు ఈ వ్యంగ్యంతో ఐడెంటిఫై అయ్యే అవకాశమే లేదు. Again I am not casting aspersions or attributing motives to Vinnakota Sir but merely pointing out unintended communication.

      ఇదే రాయలసీమ పీడా విడగ్గొట్టుకోవడానికి చక్కని అదును అనేదే అసలు ఉద్దేశ్యమయితే అపార్థం చేసుకున్నందుకు నన్ను మన్నించండి.

      నాకేదో ద్వేషం అంటకట్టడం మీ ఇష్టం. నా మనసులో ఏముందో నాకంటే బాగా అర్ధం చేసుకున్నానని మీరనుకుంటే నేనేమీ చేయలేను.

      PS: పాలనా సౌకర్యం గురించి మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తాను. అందుకే గ్రామ వాలంటీర్లు & గ్రామసెక్రెటేరియట్లు ఇప్పటికే అమలు చేసారు. రీజనల్ కౌన్సిల్ & జిల్లాల పునర్వ్యవస్తీకరణ కూడా డ్రాయింగ్ బోర్డు దగ్గర ఉన్నాయి. వీటితో బాటు తండాలు, గూడాలు (కుదిరితే బెస్తవాడలు కూడా) పంచాయితీ హోదా ఇస్తే ప్రజల వద్దకు పాలన అన్న విజన్ రూపు దిద్దుకుంటుంది. This is an important subject deserving serious debate but perhaps out of scope in this post.

      తొలగించండి
    3. జై గారు,
      1.కేసీఆర్ గారు వచ్చాక చంద్రబాబు గారు అభివృద్ధి చేసిన లేదా దోచుకున్న రాజధానిని ఎందుకు మార్చలేదు ?
      2. రాజధాని కడపలో పెట్టినా లాండ్ పూలింగ్ చేయాల్సిందే కదా ?
      3. రెడ్డొచ్చే మొదలాడు ఆన్న సామెతని నిజం చేసారు కదా ?
      4. ఆర్ధికంగా బలహీనమైన రాష్ట్రంలో
      మళ్ళీ మొదలుపెట్టటం అంటే కాలయాపన కాదా ?
      5. పాలనాసౌకర్యం కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసారు అని అంటున్నపుడు రాజధానిని మార్చవలసిన అవసరం ఏమిటి ?
      6. అమరావతిలో రాజధాని వద్దు అని ముందే చెప్పి ఉంటే ఇన్ని సంవత్సరాల శ్రమ వృధా అయి ఉండేది కాదు కదా ?

      7. మీరు రాయలసీమ అల్లుడు కాబట్టి జగన్ ని సమర్ధిస్తున్నట్లు మేము భావించడం లేదు. అమరావతిలో రాజధానిని సమర్ధిస్తున్నారు కాబట్టి టీడీపీ ని సమర్ధించినట్లు మీరు భావించడం సరి అయినదేనా ?
      8.అమరావతి రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం. చంద్రబాబు నాయుడు గారి సొత్తు కాదు.
      9. కాళేశ్వరం కాంగ్రెస్ హయాం లో మొదలుపెట్టినా పేరు, డిజైన్,నిధుల సేకరణ మొత్తం కేసీఆర్ గారే చేసారు. కాళేశ్వరం కట్టిన ఘనత కాంగ్రెస్ కి ఇచ్చారా ?
      10. ప్యాకేజీ కానీ ప్రత్యేక హోదా గురించి కానీ నోరు మెదపకుండా కేవలం చంద్రబాబుగారు చేసిన పనుల్లో అవినీతిని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఓడిపోతూ రాష్ట్ర ప్రజల సమయాన్నీ, ధనాన్నీ వృధా పరుస్తుంటే నోరుమూసుకు కూర్చోమంటారా ?

      తొలగించండి
  8. నిస్సహాయత నిస్పృహల నుండి పుట్టుకొచ్చిన జోకులు శ్యామలరావు గారూ.

    రిప్లయితొలగించండి
  9. రాజధాని సామాన్య ప్రజలకు కాదుగా అంటారా? ఆ మాట రాయలసీమ ప్రజలకు చెప్పండి "జిలేబి" గారూ. అయినా మాతృదేశానికి దూరంగా నివసిస్తున్న మీలాంటి వారు మనకెందుకని కాక ఇంకేమంటారు లెండి.

    రిప్లయితొలగించండి
  10. రాజధాని కావలసింది ప్రజలకే.
    Well said.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఏదో ప్రజలని అడిగి రాజధాని ని కట్టినట్టున్ను, ఉన్న రాజధాని ని ప్రజలని అడిగి తెలగాణ కిచ్చేసినట్తున్ను , కొత్త రాజధాని ని ప్రజల నడిగి నిర్ణయించినట్జున్ను :)

      వాళ్లు వాళ్లు డిసైడ్ మాడేసుకున్నారు అంటే ఏమిటి అర్థము ?

      ప్రజల కేమీ లేదిందులో రాజులెక్కడ అంటే అక్కడే రాజధాని

      ఏదో పెజల కోరితే రాజధాని‌ ని ఢిల్లీ నుంచి‌ ట్రివేండ్రం కి మార్చేస్తారేమిటి ?

      ఏమిటో ఈ ప్రజల సొద ! తామంతా చెబ్తే అయిపోతుందనుకుంటున్నారు


      తొలగించండి
  11. ఈ వ్యాఖ్య ప్రచురిస్తారో లేదో తెలీదు. మీ బ్లాగు మీ ఇష్టం, పైగా నా ఈ వ్యాఖ్య *మీ* టపా మీద కాదు.

    రాజధాని ప్రజల కొరకు అని మీరన్న దృష్టికోణం వనజ గారి వ్యాసంలో అగుపించలేదు. ఆవిడ వాదనల్లా "రాజధాని అందుకు భూములను అభివృద్ధి కోసం ఇచ్చిన యజమానుల (i.e. co-developers) ప్రయోజనాల కోసం" అన్నట్టుగానే ఉంది.

    అఫ్కోర్స్ ఇది కూడా ఒక లెజిటిమేట్ వాదన, ఆయా వ్యక్తుల ప్రయోజనాలు కాపాడడం తప్పేమీ కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు. టపకు సంబంధించని వ్యాఖ్యల పట్ల నాకు వైముఖ్యం ఉన్నది. ముందుముందు మరింత కచ్చితంగా ఉంటాను ఆవిషయంలో.

      రాజధాని ప్రజల కొరకు అని మీరన్న దృష్టికోణం వనజ గారి వ్యాసంలో అగుపించలేదన్నారు. మరి అందుకు భూములను అభివృద్ధి కోసం ఇచ్చిన యజమానులు ఆంధ్రప్రజలు కారా అండీ? వారు సాటి ఆంధ్రప్రజల సౌభాగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు. వాళ్ళను జూదరులు అంటున్నారు. అది కేవలం మీ సంకుచితదృష్టి అని అనుకోవచ్చు కదా. అందరు ప్రజలకోసం మొదలుపెట్టిన ఒక బృహత్తర కార్యక్రమాన్ని మీ అభిమాన నాయకుడి దొడ్డబుధ్ధి అటకెక్కించింది. అది మీకు ఆక్షేపణీయం కాకపోవచ్చును. పైకి మీరు కూడా అంధ్రా కూడా అభివృధ్ధి చెందాలనే నా తహతహ అనవచ్చును. కానీ, లోలోపల మాత్రం "భలే జరిగింది. లేకపోతే వీళ్ళూ మన తెలంగాణాతో సాటిగా అభివృధ్ధి చెందుదామనే?" అని మీరు అనుకుంటూ ఉండవచ్చునని ఎవరన్నా అతిసులువుగా అభిప్రాయపడే విధంగా ఉన్నాయి మీ బ్ల్గాగువ్యాఖ్యావిన్యాసాలు. అపోహలకు తావిచ్చే విధంగా కాక మీరు మరింత హుందాగా వ్యాఖ్యలు వ్రాస్తే నాబోటి వారు సంతోషిస్తారు.

      తొలగించండి
    2. "ఒక వాక్యం" చదివి quote mining చేసే బదులు మొత్తం వ్యాసం సారాంశం చూస్తే బెటర్.

      వనజ గారి దృక్పధాన్ని నేను అర్ధం చేసుకోగలను. ఆవిడ తన వాదాన్ని ఎంతో చక్కగా రాసారనేందుకు నాకు ఎటువంటి సంకోచమూ లేదు.

      సదరు "రైతులు" కూడా ప్రజలే, వారి ప్రయోజనాలకు భంగం జరగాలన్నది నా కోరిక కాదు. కాకపొతే కామందుల ప్రయోజనం *మాత్రమే* అధికారాన్ని *ఏకపక్షంగా* శాసించకూడదన్న కోణం కూడా ముఖ్యం. బహుళ ప్రజాభీష్టాన్ని ప్రాతినిధ్యం వహించే జనహృదయనేత జగన్ ఇదివరకటి "కొందరి వాడిలా" కాక అందరి వాడిగా మిగుల్తాడని ఆశిస్తాను.

      అభివృద్ధికి అనేక పరస్పర విరుద్ధ నిర్వచనాలు/పంథాలు. చైతన్యవంతులయిన "సామాన్య" ఆంధ్ర ప్రజలు పైనుండి రుద్దే top-down trickle flow నమూనాను నిర్ద్వందంగా (151/175) తిరస్కరించడం ద్వారా తమ రాజకీయ పరిణితిని లోకానికి చాటిచెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగుతుందని నా ఆశ.

      తొలగించండి
    3. జై గారు జగన్మోహనులకు మంగళాశీస్సులు పలికారు. కాని ప్రస్తుత ప్రభుత్వాన్ని పొగడ్డానికి అవకాశం దొరకబుచ్చుకున్నారు. ఈవిషయంలో నా అసమ్మతిని తెలియజేస్తున్నాను. ఈప్రభుత్వం చేసే నిర్ణయాలు బాగుంటే ఈ ఆవేదన దేనికి, ఈటపా దేనికి. నేనొక అవివేకిని అని మీరు సూటిగా చెప్పారు. మంచిది. మీ చక్కని విశ్లేషణాశక్తి అంతా ఇలాటి సమర్ధనలకే సరిపోతోంది. పోనివ్వండి. సెలవు.

      తొలగించండి
  12. జై గారూ,
    వనజ గారి వ్యాసంలో ఒక వాక్యం ఇలా ఉంది "అమరావతి ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజల కలల రూపం అది వాస్తవరూపం దాల్చకుండా ప్రజలే తింటున్న వాళ్ళ కంచంలో నీళ్ళు పోసుకున్నారు" అని

    మరి మీరు "రాజధాని ప్రజల కొరకు అని మీరన్న దృష్టికోణం వనజ గారి వ్యాసంలో అగుపించలేదు" అంటూ ఎలా తీర్మానించారండీ?

    రిప్లయితొలగించండి
  13. Shyamal Rao garu, Unknown ప్రస్తావించిన సామాజిక వర్గం అంశం రాజధానికి సంబంధం ఉంది. విన్నకోట గారు ఒక వైపే చూసి అభిప్రాయం చెప్పారు.

    నేను జగన్ అభిమానినే కానీ రాజధాని తరలింపు ఇప్పుడు చేయడం సరికాదు. ఆనాడే జగన్ వ్యతిరేకించి ఉండాల్సింది.

    విన్నకోట గారికి కొన్ని ప్రశ్నలు.

    1) 33 000 ఎకరాలు సారవంత మైన భూమిని సేకరించడం ఎలా సమర్థిస్తారు.
    2) మన ఆర్థిక వనరుల ప్రకారం బాబు చూపించిన గ్రాఫిక్స్ రాజధాని సాధ్యం కాదని మీకు అనిపించ లేదా.
    3) శివరామ కృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి తమ సామాజిక వర్గం కోసమే అమరావతి లో రాజధాని ఏర్పాటు చేయడంలో బాబు స్వార్థం లేదా.

    4) జగన్ రెడ్లకు పెద్ద పీట వేస్తున్నాడు అని సులభంగా చెబుతారు. కానీ బాబు కమ్మ వారికి అనుకూలంగా చేసిన పనుల గురించి ఎందుకు అసలు చెప్పరు. మంచి చెడు రెండు వైపులా చెబితే బాగుంటుంది.

    5) రామోజీ, రాధా కృష్ణ, బాబు, బాలకృష్ణ వీళ్ళ వల్లనే వారి సామాజిక వర్గం పట్ల తెలుగు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది మీరు కాదనగలరా.

    ఒక మాట. ఇది నా అభిప్రాయం మాత్రమే. పచ్చ మీడియా ఏళ్ళ తరబడి చేసిన చేస్తున్న దుష్ప్రచారం ప్రభావం ఆంధ్ర ప్రాంతం లో చాలా ఉంది ముఖ్యం గా బ్రాహ్మలలో. మా బంధువర్గం లో కూడా నేను ఇది గమనించాను.

    ఏడు నెలల పాలనలో జగన్ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కొన్ని మంచి పనులు కూడా జరిగాయి అని నాకు అనిపిస్తుంది. అయితే అతను ముఖ్యమంత్రి కావడమే దౌర్భాగ్యం అన్న రీతిలో మాట్లాడడం సరికాదు.

    Unknown చేసిన వ్యాఖ్య లో అభ్యంతరకరం ఏముంది సార్. భిన్నాభిప్రాయాన్ని కూడా పరిగణించండి.

    ఆవేదన ఏమీ అవసరం లేదు. మంచి నిర్ణయమే వస్తుంది. ఆంధ్ర లో కులపిచ్చి తగ్గేంత వరకు ఈ ఘర్షణ లు తప్పవు.

    నా అభిప్రాయం చెప్పాను. తప్పు ఉంటే మార్చుకోవడానికి వెనుకాడను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుచికి గారు,

      ఈ చర్చను ముగించే ఉద్దేశంలో ఉన్నాను. ముగింపు వ్రాయబోతుండగా మీ యీ స్పందన వచ్చింది. కాబట్టి ముందుగా మీకు నా సమాధానం వ్రాస్తున్నాను.

      సారహీనమే పచ్చని మొక్క బ్రతికే అవకాశం లేని చోట రాజధాని ఉండాలన్న సిధ్ధాంతం సమర్ధనీయం అనుకోను. పెద్ద రాజధాని కోసం ఎక్కువ స్థలం సేకరించటం అన్నది దీర్ఘకాలిక ప్రయోజనం కోసం. పెద్ద నగరం రాష్ట్రం యొక ఆర్ధిక పరిపుష్టికి దోహదం చేస్తుంది. కాదని వాదించే వారికి ఒక నమస్కారం. చేతిలో ఉన్న ఆర్ధిక వనరుల ప్రకారం పెద్ద రాజధానిని నిర్మించటం సాధ్యం కాదు కాని ప్రణాళిక బధ్ధంగా అర్ధికస్వావలంబనను తద్వారా రాష్ట్రవికాసానికి దోహదపడే స్థితినీ సాధించేందుకు పెద్దనగరాన్ని నిర్మించటాంనికి ప్రయత్నించటం తప్పుకాదు. ముందుచూపుతో దానికి తగిన వనరులను సమాయత్త్తం చేయటానికి యత్నించటాన్ని రాజకీయ స్వలాభాలకోసం అడ్డుకోవటం కూడా మంచిది కాదు. రాజధాని ఏదో ఒక సామాజికి వర్గానికే ఎలా చెందుతుంది? అక్కడికి వచ్చే పరిశ్రమల్లో ఒక సామాజికి వర్గం వారికే అవకాశాలు వస్తాయా? ఒకసామాజిక వర్గం కోసం అన్న ప్రచారం నమ్మదగ్గదిగా అనిపించదు.

      ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం అంశం మొదట అజ్ఞాత ప్రస్తావించారు కాని నేను కాదు. సమాధానంగా రెండవవైపును కూడా చూపానంతే.

      తెలుగుదేశం పట్ల నాకు సానుభూతి కాని వ్యతిరేకత కాని లేదు. వారి ఓటమికి ఇదీ కారణం అని ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు. వాటిపై స్పందించను. ఇకపోతే పచ్చమీడియా పచ్చమీడీయా అని అరిచేవారిని పిచ్చిమీడియా అని పిలవక తప్పదు. హుందాగా ఉండకుండా మీరు ఆవలి వారిని హుందాగా మాట్లాడమటే ఎలాగండీ.

      ప్రస్తుత ఆంద్రప్రభుత్వం మంచిపనులు చేస్తున్నట్లు మీకు అనిపించటం పట్ల నా అభ్యంతరం ఏముంటుంది. నా అభిప్రాయాలు నావి. రాజధాని విషయంలో ఆ ప్రభుత్వవిధానం పట్ల నాకైతే అసంతృప్తి ఉంది. ఫలాని వారు ముఖ్యమంత్రి కావటం అదృష్ఠం అనో దురదృష్టం అనో నేను అనలేదు.

      అజ్ఞాత గారి వ్యాఖ్యలో భిన్నాభిప్రాయం పరిగణించటం వరకూ అభ్యంతరం లేదు. అందుకే ఆ వ్యాఖ్య ప్రచురితం ఐనది. కాని ఆ అజ్ఞాత అభిప్రాయం ఒక నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించటానికే పరిమితం ఐనది. అంతటితో ఆగకుండా టపారచయితను అనుచితంగా ఎత్తిపొడవటం జరిగింది కాని అది మీ దృష్తికి రాలేదు మరి.

      ఆవేదన అసవరం లేదని మీరు ఓదార్చి లాభం లేదు. దానికి తగిన మంచి వాతావరణం ఉందని మీరు అనటం కాదు అందరం అనుకోవాలి. లేకపోతే ఆవేదన ఎలా తగ్గుతుంది. ఇప్పటివరకూ మంచినిర్ణయాలు రాలేదనే అనుకుంటున్నాను - ఇది కనీసం నా అభిప్రాయం.
      తప్పొప్పులను నిర్ణయించవలసింది కాలం.

      తొలగించండి
  14. ఇంతటితో ఈటపాపై చర్చ ముగిసినది. అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. చర్చ కొంచం ఆపరిపూర్ణంగా ముగిసినా, అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగినందుకు మిక్కిలి సంతోషం. మీ బ్లాగు ఇట్లాగే వీక్షకులతో & ఆసక్తికర ఆలోచనా సాదృశ్యమయిన వ్యాఖ్యలతో కళకళలాడాలని ఆశిస్తాను.

    మీకు, మీ కుటుంబీకులందరికీ, అట్లాగే విన్నకోట, సూర్య, బోనగిరి, జిలేబీ, నీహారిక, బుచికి తదితర బ్లాగ్లోక ఆత్మీయబంధువులు అందరికీ వార్వారి పరివార సదస్యులకు ఆయురారోగ్యానందాలతో కూడిన నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    Happy new year 2020 to all the elders & friends

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.