6, డిసెంబర్ 2019, శుక్రవారం

చచ్చిరి మృగాళ్ళు - మెచ్చిరి జనాలు


నరకాసురులను
అరికట్టేందుకు
మరణమృదంగం మ్రోగినది

చచ్చిరి మృగాళ్ళు
మెచ్చిరి జనాలు
ఇచ్చట న్యాయం జరిగినది

మానవజాతికె
మానవహక్కులు
లేనే లేవవి మృగాళ్ళకు

తెలిసీతెలియని సంఘాల్లారా
బలియైపోయిన బాలిక కూడా
తెలియట్లేదా మనిషేనన్నది దేనికి మీ గడబిడ
పలుకక తమాష చూసా రప్పుడు
తుళువల చావుకు వగచేరిప్పుడు
కలనైనా మీవంకర బుధ్ధులు మారేదే లేదా

ఇదే మంచి శిక్ష సుమా
ఇదే తగిన శిక్ష సుమా
ఇదే - కామపిశాచాల వధే జనహితం

1 కామెంట్‌:

  1. దిశ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇంతటితో వదిలివేయకుండా మూల మూలల్లో వెతికి పట్టుకుని కామ పిశాచి పిచ్చి కుక్కలను మట్టు పెట్టాలి. పిశాచుల హక్కులు గురించి మాట్లాడే ఉన్మాదులను కూడా వదిలిపెట్ట కూడదు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.