విముక్త -వోల్గా అని ఒక టపా చదివి వ్రాయవలసి వచ్చింది ఈరోజున.
నేను చదివిన టపా ప్రకారం ఆ విముక్తలు ఎవరంటే శుర్పనఖ, అహల్య, రేణుక, ఊర్మిళ మరియు రామ అట.
ఈ విముక్త -వోల్గా అంతా ఖండనీయమే.
ఇప్పటికే ఒక వ్యాఖ్య పంపాను. అది తొలగిస్తారో ఉంచుతారో తెలియదు. అది ఇలా ఉంది.
"వ్యాసవాల్మీకుల కన్నా మనం తెలివైనవారం అన్న అతితెలివితో చేసే వికారపుభావనలనుండి ఇలాంటి వెర్రిమొర్రి కల్పనలే వస్తాయి. ఇతిహాసాలు పెద్దగ్రంథాలు కాబట్టి అందరూ అధ్యయనం చేయరు. చేయలేరు. ఈమేతావుల దృష్టి అంతా వాటిని అవహేశన చేయటం మీదే నాయె. కల్పన పేరిట అనుచితంగా వ్రాయకూడదు కదా - మూలకథకు కాని పాత్రల స్వరూపస్వభావాలకు కాని విఘాతంగా కల్పన ఉండరాదు కదా! ? కాని మన మేతావుల కల్పనాస్వాతంత్ర్యం వెనుక ఉన్న సనాతనధర్మధ్వేషం కారణంగా వారికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. మూలకథను ఇచ్ఛిన ఋషులూ లేరు కాపీరైట్ గోలా లేదని ఎంత హీనమైన కల్పనలూ చేస్తున్నారు. వీళ్ళని శిక్షించేందుకు ప్రస్తుతం చట్టాలు సరిపోకపోతే - వీళ్ళకు భగవంతుడి నుండి శిక్ష ఉండకపోదు"
అవశ్యఖండనీయమైన ఆటపాలోని కొన్ని ఆణిముత్యాలు చూదాం.
ఎందుకంటే సత్యం ఎపుడు ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది అని ఒకటి.
ఇంతకంటే పిచ్చిమాట ఉంటుందా? ఘడియ ఘడియకూ మనిషి మనిషికీ మారేది సత్యమే కాదు.
మరొక ఆణిముత్యం. నీకు తప్పు లేదు అనిపిస్తే విచారణ కి లొంగకు అధికారానికి తల వంచకు.
రోజూ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తున్నాం. ఎన్ని నేరాలో. ఆవలి వ్యక్తిపై కోపం వస్తే చంపేయటమే. ఆవేశంలోనూ అవివేకంతోనూ ప్రతివాడూ "చంపేస్తే తప్పులేదు" అని భావించి అఘాయిత్యానికి ఒడిగట్టిన వాడే. తనకు తప్పు లేదు అనిపించే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వెన్నుతట్టి చెప్తున్న మాట ఏమిటంటే "విచారణ కి లొంగకు అధికారానికి తల వంచకు." పోలీసులకూ కోర్టులకూ ఏమీ అధికారం లేదు - నీకు రైట్ అనిపించింది చేసాక అని! శబాసూ.
ఇది చూడండి "జ్ఞాన సంపాదనకు అనుభవాన్ని మించిన మార్గం లేదు." అట.
అనుభవం అనేది వ్యక్తిగతం. అనుభవం ద్వారా వచ్చే జ్ఞానం వ్యతిగత సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది. అంధుచేత ఎవరి అనుభవమూ స్వతఃప్రమాణం కాలేదు. పరంపరానుగతంగా కాలానికి నిలబడిన పెద్దల వాక్యం ప్రమాణం.
ఒక చెత్త పుస్తకం గురించి ఒక చెత్త ప్రశంశ! దేవుడా!!
Sir,
రిప్లయితొలగించండిwellsaid
సనాతనధర్మాన్ని అవహేళనచేయటం కోసం వెలువడే ఇలాంటి రచనలను ఎదురుకొని దుష్టువ్రాతలకు శిక్షలు వేయించేందుకు పూనుకొనేవారే కనిపించటం లేదు. అది ఈ కుహనా మేథావులకు ఒక వరం లాగా పనిచేస్తోంది.
రిప్లయితొలగించండిఇతర మతాల గురించి కాని, ఆమతాల గ్రంథాలలోని పాత్రల గురించీ వీళ్ళు చచ్చినా ఒకముక్క కూడా వ్రాయటానికి సాహసించలేరు. కారణం అందరికీ తెలిసినదే.
If they write, get killed within no time
రిప్లయితొలగించండి