జయజయ రామా గోవిందా హరి జానకిరామా గోవిందా
జయజయ శ్రీమన్నారాయణ హరి జయ దాశరథీ గోవిందా
త్రిజగత్పావననామా రామా దేవదేవ హరి గోవిందా
భుజంగశయనా రమానాయకా పుండరికాక్షా గోవిందా
త్రిజగత్కారణకర్తా రామా దివ్యప్రభావా గోవిందా
విజయరాఘవా వీరవరేణ్యా విశ్రుతచరితా గోవిందా
సకలలోకపరిపోషక రామా సర్వోత్తమ హరి గోవిందా
సకలాగమసన్నుతప్రభావా సద్భక్తావన గోవిందా
వికటదైత్యసంహారక రామా విజయరాఘవా గోవిందా
వికచోత్పల బహుసుందరనయనా విమలచరిత్రా గోవిందా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.