దిక్కంటే అందరకూ దిక్కు రాముడే
దిక్కంటే అన్నిటీకీ దిక్కు రాముడే
సర్వలోకములకు రామచంద్రు డొకడె దిక్కు
సర్వకాలములను రామచంద్రు డొకడె దిక్కు
సర్వజీవులకును రామచంద్రు డొకడె దిక్కు
సర్వవిధములుగను రామచంద్రు డొకడె దిక్కు
సర్వదిక్కులందు రామచంద్రు డొకడె దిక్కు
సర్వకష్టములను రామచంద్రు డొకడె దిక్కు
సర్వవ్యాధులందు రామచంద్రు డొకడె దిక్కు
సర్వులును తరింప రామచంద్రు డొకడె దిక్కు
రిప్లయితొలగించండినేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ ఇద్దరి మాటల కన్నా యీమౌనమే నన్ను ఎక్కువగా బాధిస్తున్నది. పిచ్చివాళ్ళ స్వర్గంలా మారి కశ్మలపూరితంగా తయారైన ఈ తెలుగుబ్లాగుల మధ్య నేను ఉండలేను. ఉండటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు కూడా. కాబట్టి ఇక సెలవు.