శ్రీరామ నాదైన చిత్తంబు నీయందు లగ్నంబుగా జేసి సేవించు నన్నేల మన్నింప కున్నావురా రామ నన్నేల రక్షించ కున్నావురా రామ నన్నేల క్రీగంటనుం జూడ కున్నావురా రామ నన్నేల దూరస్థునిం జేయు చున్నావురా రామ నన్నేల నీబుధ్ధికిం దోచదేరా మహాత్మా మహానందకందా సురానంద బృందారకేంద్రార్చితా సర్వయోగీంద్రబృందార్చితా సర్వలోకార్చితా సర్వవేదాంతసంవేద్యదివ్యప్రభావా సదానంద సాకారబ్రహ్మస్వరూపా భవా వేదగమ్యా ధరాకన్యకాప్రాణనాథా సదా భక్తసంసేవ్యపాదారవిందద్వయా యజ్ఞయజ్ఞేశ యజ్ఞోద్భవా యజ్ఞసంరక్షకా ధర్మసంరక్షకా లోకసంరక్షకా భక్తసంరక్షకా దీనసంరక్షకా భక్తసంపోషకా భూమియున్ బ్రహ్మయున్ దేవతాముఖ్యులున్ వచ్చి పౌలస్త్యు దౌష్ట్యంబులం జెప్పి దుర్వార్యుడౌ వాని గర్వంబడంగించి రక్షించ నీకన్న వేరెవ్వరుం దిక్కులేదన్న నాపన్నులౌ వారి దీనత్వముం బాప సంకల్పముంజేసి సూర్యాన్వయంబందు శ్రీరామచంద్రుండనై బుట్టి దుర్మార్గు నారావణుం జంపుదుం దాన మీకష్టముల్ దీరు పొండన్న వారంత హర్షాతిరేకంబునుం బొంది నారాయణా భక్తపాలా నమస్తే నమస్తే యటంచుం జనం బిమ్మటం....
(ఇంకా ఉంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.