11, మార్చి 2026, బుధవారం

వేదాద్రిశిఖరాన వెలసిన దీ సింహము

వేదాద్రిశిఖరాన వెలసిన దీ సింహము 
కోదండరామాఖ్య గొన్న సింహము 
 
మత్తదైత్యగజేంద్రమును 
  మట్టుబెట్టు నరసింహము
బత్తిజూపు వారికి వరదసింహము

ఎత్తున వేదాంతగుహల 
  నెసగు బ్రహ్మమగు సింహము
కొత్తదైవతములకు కొదమసింహము
 
వినయశీలురైన భక్త
  వీరుల హృద్వీధు లందు
దినదినము నూరేగు దివ్యసింహము

మునిమానసరాజహంస 
  యనెడు ప్రఖ్యాతి మిగుల
గొనిన ముక్తి నొసగెడు గొప్పసింహము
 

2 కామెంట్‌లు:

  1. సార్ ఒక విన్నపం. మీరు వేల సంఖ్యలో రామకీర్తనలు వ్రాశారు. కొంత మార్పుగా

    విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షము గ్రంథములోని పద్యాలు మా వంటి వారికి సులభంగా అర్థం కావు. మీరు రోజుకు ఒకటి లేక రెండు పద్యాలను క్రమంలో తాత్పర్యం మరియు తగుమాత్రం వివరణ తో క్లుప్తంగా అందిస్తే బాగుంటుంది. మీరు ఈ కార్యానికి సమర్థత అధికారం కలిగిన వారు.
    వీలు పడుతుందేమో ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి ఆలోచన. రామకార్యం. నాసమర్దత సందేహాస్పదమే. ఐనా రామప్రీతిగా శక్తికొలది అవశ్యం చేయవలసినదే.

      ప్రస్తుతం ఇంకా దెబ్బలనుండి కోలుకొనే స్థితిలోనే ఉన్నాను. రామానుగ్రహం మేరకు వీలై నంత త్వరగా మొదలుపెడదాము.

      మంచిఆలోచన ఇచ్చినందుకు ధన్యవాదాలండీ.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.