ఏమి రుచి యీ రామనామము
నామవర మీ రామనామము
శివునికృపచే రామనామము
చేరినది జిహ్వాగ్రమందున
వివిధగతులను రామనామము
వెలసినది జిహ్వాగ్రమందున
పవలురేలును రామనామము
పరగినది జిహ్వాగ్రమందున
అవిరళంబుగ రామనామమె
యమరినది జిహ్వాగ్రమందున
జనులు పొగడే రామనామము
సాగినది జిహ్వాగ్రమందున
మునులు పొగడే రామనామము
మురిసినది జిహ్వాగ్రమందునఇ
ఘనతచెందిన రామనామము
కమ్మనగు జిహ్వాగ్రమందున
దినదినంబును రామనామము
తేజరిలు జిహ్వాగ్రమందున
పాపమణచే రామనామము
పలికినది జిహ్వాగ్రమందున
తాపమణచే రామనామము
తానొదిగె జిహ్వాగ్రమందున
కాపుదలయై రామనామము
కలిగినది జిహ్వాగ్రమందున
నాపుణ్య మిది రామనామము
నాకొదవె జిహ్వాగ్రమందున
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.