అందరి వాడీ రాముడు మన మడిగిన విచ్చే రాముడు
కొందరు లేడనగానే కీర్తికి కొంచెము కాని రాముడు
కొందరు లేడనగానే కీర్తికి కొంచెము కాని రాముడు
సత్యసంధుడీ రాముడు బహు సరసహృదయుడీ రాముడు
నిత్యము భక్తుల కోర్కెలు తీర్చే నిరుపమానుడీ రాముడు
భృత్యపోషకుడు రాముడు కడు పుణ్యచరితుడీ రాముడు
ప్రత్యర్ధులు సురవిరోధుల నొంపవచ్చిన దేవుడు రాముడు
పరమపావనుడు రాముడు పాపపర్వతవజ్రము రాముడు
కరుణామయుడీ రాముడు యోగివరసన్నుతుడీ రాముడు
పరదైవతమీ రాముడు శివపార్వతి వినుతుడు రాముడు
తిరముగ గొలిచిన కైవల్యమునే వరముగ నిచ్చే రాముడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.