5, ఏప్రిల్ 2026, ఆదివారం

నిమిషాంబికాదర్శనం.

 


ఈరోజు అనగా ఆదివారం 2026 ఏప్రిల్ ఐదవతారీఖున సాయంకాలం హైదరాబాదు నగరంలోని బోడుప్పల్ ప్రాంతంలో కొలువైన నిమిషాంబికా అమ్మవారిని దర్శించుకున్నాను.

మాచెల్లెలు లక్షి, మాబావగారు హరి గారూ తాము వెళ్తూ నన్ను కూడా తీసుకొని వెళ్ళారు.

వారిద్దరూ గోత్రనామాలతో అర్ఛన చేయించుకున్నారు. 

నేను దండం పెట్టుకున్నాను.

అనంతరం అమ్మకు ఒక కీర్తనను సమర్పించుకున్నాను. దానిని అమ్మ భక్తుల సౌకర్యార్ధం ఈటపాలో పొందుపరుస్తున్నాను.

నిమిషాంబికే జగదంబికే
   నిత్యాదితిథిదేవతాపూజితే
సుమాండుజనుమాండు సురవైరిప్రాణవి
   శోషణామితపరాక్రమశోభితే

శక్తౌఘసంపూజ్యచరణారవిందే
భక్తావనానిపుణపావనమూర్తే
ముక్తక ఋషివర్యపుణ్యావతారే
ముక్తిదాయకజగన్మోహనమూర్తే

తాపాంతకే జనదారిద్ర్యనాశిని
పాపాంతకే సురవరపూజితే దేవి
శాపాంతకే భవచక్రాంతకే దేవి
శ్రీపార్వతీ శివప్రియభామినీ దేవి


నిమిషాంబికా అమ్మవారికి కర్నాటకలో ఒక ఆలయం ఉంది. ఇది మరొకటి.

అమ్మవారిని దర్శించున్న తరువాత చాలా సంతోషం కలిగింది.

ముఖ్యంగా అమ్మవారికి సమర్పించిన కీర్తనను తల్లి తన సమక్షంలోనే గానం చేసే భాగ్యం కలగించినందుకు మరింత సంతోషం కలిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.