| ఆ.వె. | ఎవరి బల్కరింతు నేమని పలుకుదు నవ్వు వారు దిట్లురువ్వు వారు పలుకకుండు నట్టి వారలే యధికులై యున్న నేను పలుకకునికి తగును |
| కం. | హరి తక్క నన్ను మెచ్చెడి నరు లంతగ లేని బ్రతుకు నాకు లభించెన్ హరికృపచే నటు లగుటయు నరయగ మేలనుచు దలతు నతిముదమునన్ |
| కం. | రాముడు నాతో పలుకును రాముని స్నేహంబు చాలు లాతిజనులతో భూతలమున పొసగమిచే నేతాపము గాని జెంద నేటికి నాకున్ |
| ఆ.వె. | కనుక మౌనమూని ఘనుని రాముని లోన దలచుకొనుచు నుంటి ధైర్యముగను జరిగినన్ని నాళ్ళు జరుగు నీరీతిగా పిదప నొరుగు దనువు పృధ్వి పైన |
| ఆ.వె. | అవల నన్ను దలచునట్టి వారుందురో యొక్క రైన నవని నుండ కున్న వింత యేమి యుండు విపులమౌ ధరణిపై నెవ్వ రెవని దలతు రెన్ని నాళ్ళు |
11, ఏప్రిల్ 2026, శనివారం
స్వగతం - 1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.