8, ఏప్రిల్ 2026, బుధవారం

హరిమెచ్చిన చాలునని

 

హరిమెచ్చిన చాలునని యనుకొన వయ్యా శ్రీ

హరిమెచ్చిన యిచ్చుమోక్ష మనుకొన వయ్యా


హరిని యాత్మీయుడని యంతరంగ మందెంచి

హరిప్రీతిగ సత్కర్మము లాచరించుచు నిలచి

హరిభక్తుల నిరంతరం బాశ్రయించి సేవించి

హరినామము నాలుకపై నన్ని వేళలను నిలిపి


హరు డొసగిన భవతారక మతిప్రేమగ ననుష్ఠించి

హరుని వోలె మనసు హరిధ్యానమందున నిలిపి

హరేరామ మంత్రము నీ వర్హుల కుపదేశించి

హరికే నీ జీవితంబు నంకితం బనగ నిలిపి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.