15, ఏప్రిల్ 2026, బుధవారం

పొగడండీ శ్రీరాముని భువనేశ్వరుని


పొగడండీ శ్రీరాముని భువనేశ్వరుని మీరు
పొగడండీ శ్రీరాముని పురుషోత్తముని

పొగడండీ సకలదేవపూజితపదపద్ముని
పొగడండీ సకలమునిముఖ్యసంపూజితుని
పొగడండీ సకలదైత్యభుజగవైనతేయుని
పొగడండీ దశరథబహుపుణ్యావతారుని

పొగడండీ సకలభక్తపోషణాదీక్షితుని
పొగడండీ సకలహృదయపుండరీకవాసిని
పొగడండీ సకలనిగమభూషితాభిదానుని
పొగడండీ సకలమునిమోక్షదానశీలుని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.