భవసాగరమెట్లు దాటవచ్చునని యడిగేవు
వివర మెరిగితే దాటువిధము సులువనేవు
చిల్లరసౌఖ్యముల గోరి చిక్కుల పాల్గాక
చిల్లరసొమ్ములకు నాశ చేసి తిరుగకుండ
ఎల్లవేళలందు వెన్ను నెంచి పూజించితే
చల్లగాను నీవు భవసాగరమును దాటేవు
చిల్లరదేవతల గొల్చి చింతల పాల్గాక
అల్లరల్లరి పనులతో నగచాట్ల పాల్గాక
యుల్లమున రామచంద్రు నుంచి పూజించితే
చల్లగాను నీవు భవసాగరమును దాటేవు
కల్లగురువులను గొల్చి కడగండ్ల పాల్గాక
కల్లమతములను జేరి గబ్బెక్కిపోకుండ
నల్లనయ్య శ్రీకృష్ణుని నమ్మి పూజించితే
చల్లగాను నీవు భవసాగరమును దాటేవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.