11, ఏప్రిల్ 2026, శనివారం

భవరోగానికి రామనామమే పనిచేసే మందు


భవరోగానికి రామనామమే పనిచేసే మందు

శివుడే చెప్పిన చక్కని మందు జిహ్వమెచ్చు మందు


రోగమెంతగా ముదిరిపోయినా బాగుచేయు మందు

యోగుల భోగుల కందరికీ యిది యోగ్యమైన మందు

రోగకారకము లగు కర్మంబుల నీగ జేయు మందు

బాగు చేసి స్వస్థితి చేకూర్చెడు భలే మంచి మందు


ఎట్టి పరిస్థితిలో పనిచేసెడు నెదురు లేని మందు

గట్టి శ్రధ్ధతో సేవించినచో ఘనతచూపు మందు

ముట్టగనే జిహ్వాగ్రంబును పని మొదలుపెట్టు మందు

వట్టిమాట లివి కావు పెద్దలకు పనిచేసిన మందు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.