9, ఏప్రిల్ 2026, గురువారం

ఈశ్వరానుగ్రహమే


ఈశ్వరానుగ్రహమే యిన్నిటికిని మూలము

ఈశ్వరానుగ్రహమే యిచ్చు నీకు సర్వము


ఏది నీకు లభించిన నీశ్వరానుగ్రమే

ఏది నీకు దొరుకకున్న నీశ్వరానుగ్రహమే

ఏది నీకు సాధ్యమైన నీశ్వరానుగ్రహమే

ఏది నీ కసాధ్యమైన నీశ్వరానుగ్రహమే


ఎవరు నీకు హితులైన నీశ్వరానుగ్రహమే

ఎవరు ను కహితులైన నీశ్వరానుగ్రహమే

ఎవరు నిన్ను నమ్ముచున్న నీశ్వరానుగ్రహమే

ఎవరు నిన్ను నమ్మకున్న నీశ్వరానుగ్రహమే


ఇదిగో హరిభక్తి కలుగు నీశ్వరానుగ్రహమే

ఎదలో రామయ్య నిలుచు నీశ్వరానుగ్రహమే

ఇదిగో తారకము దొరకు నీశ్వరానుగ్రహమే

ఇది నీకు ముక్తి నిచ్చు నీశ్వరానుగ్రహమే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.