7, ఏప్రిల్ 2026, మంగళవారం

సుఖము

మనుజులతో నంటకాగినలేదు సుఖము

పెనగొని హరిపాదయుగళి కనుగొనుము సుఖము


తమతమ సుఖంబునకై తహతహలాడు వారి

భ్రమపడి నీవాశ్రయించి బడయలేవు సుఖము

భ్రమలన్నియు విడువుమా రాఘవుని చేరుమా

విమలగుణోన్నతుని శరణు వేడు మదే సుఖము


ఏవేవో కూటి విద్యల నెంతగాను నేర్చిన

భావింపగ నొక్కింతయు బడయలేవు సుఖము

నీవన్నియు విడువుమా నేడు హరిని చేరుమా

నీవాడను శరణంబని నిలువు మదే సుఖము



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.