రామా యని నీవనినంత
రాదా నీకు పులకింత
రాము డుండగా నీచెంత
రాము డుండగా నీచెంత
రాదు రాదు నీ కేచింత
రాముని పూజలు చేసేవేళల
రాలును జలజల కన్నీళ్ళు
రాముని కీర్తన పాడేవేళల
రాముని కీర్తన పాడేవేళల
రాపడు నపుడపుడు గొంతు
రాముని చరితము చదివేవేళల
రాముని చరితము చదివేవేళల
నీ మన సార్ద్రతనే పొందు
రాముని మంత్రము జపించు వేళల
రాముని మంత్రము జపించు వేళల
బ్రహ్మానందంబే కలుగు
రాముని దయచే కలిగిన బ్రతుకును
రామున కర్పించితివి కదా
రామున కన్యము తలపోయక శ్రీ
రామున కన్యము తలపోయక శ్రీ
రాముని సేవించెదవు కదా
రాముని సంకీర్తనము చేయుటే
రాముని సంకీర్తనము చేయుటే
ప్రాణాధిక మని యందువుగా
రాముని యందే ప్రాణము నిలిపి
రాముని యందే ప్రాణము నిలిపి
రాముని తోనే యుందువుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.