నీరాము డొక్కడే నీకు తోడు
నీరాముని యండే నీకు చాలు
ఎవరిమాట పట్టుకొని యీభూమికి వచ్చావో
ఎవరియండ నమ్ముకొని యీభూమికి వచ్చావో
ఎవరిసేవ చేయుటకై యీభూమికి వచ్చావో
శివదేవుని యాన వాడె శ్రీరాముడె నీతోడు
సకలసుజనకోటి కిలను శరణమైన వాడెవరో
సకలలోకములకు సతము శరణమైన వాడెవరో
సకలలోకపతులకను శరణమైన వాడెవరో
వికచసరోరుహాక్షుడా వీరరాఘవుడె తోడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.