జోరుచేయండీ భజన జోరుచేయండీ
శ్రీరాముల వారి భజన జోరుచేయండీ
ఊరువాడ కలిసిరాగ జోరుచేయండీ
ఊరంతయు హోరెత్తగ జోరుచేయండీ
నోరునొవ్వ పాడి యాడి జోరుచేయండీ
మారుతియే మెచ్చి చేర జోరుచేయండీ
వేరు ప్రసంగములు లేక జోరుచేయండీ
హోరెత్తగ హరికీర్తన జోరుచేయండీ
వీరపత్ని సీత పొంగ జోరుచేయండీ
దారిపట్టి కలిపారగ జోరుచేయండీ
ఊరందరి యఘము లణగ జోరుచేయండీ
ఊరికి శుభవృష్టి కలుగ జోరుచేయండీ
చేరి దేవతలు పొగడ జోరుచేయండీ
నారాయణమూర్తి మెచ్చ జోరుచేయండీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.