20, మార్చి 2026, శుక్రవారం

మురళి నూదరా కృష్ణా

మురళి నూదరా కృష్ణా
మురళి నూదరా
పరమ మనోహరము నీ
మురళి పాటరా

భువనమోహనము నీ మురళిపాట
శ్రవణసుభగమైన నీ చక్కనిపాట
కువలయాక్షు లందరు కోరెడుపాట
సవరించి నీ మురళిని సాగించు పాట

విన వచ్చె నదే మింటి పైన నా చంద్రుడు
వినగ నెమ్మదించిన యమున నటు చూడు
విన వచ్చి వేచిన గోపికలను చూడు
వినిపించి మురళిపాట వేడుక చూడు

పూపొదలు వేచియున్న  మురళిపాట
యీపొలతుల ప్రాణమైన యింపగుపాట
గోపాలక యమృతమై కురిసెడు పాట
ఓప లేమింక పాడ నుద్యమించరా


2 కామెంట్‌లు:

  1. "విన వచ్చె నదే మింటి పైన నా చంద్రుడు
    వినగ నెమ్మదించిన యమున నటు చూడు" -- 👌🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.