31, ఆగస్టు 2021, మంగళవారం
నీ సాటివాడనా నీకు బుధ్ధులు చెప్ప
తన్ను తానెఱిగి హరి ధరమీద నిలచినట్లు
హరి నీకు సరిజోడు సరసాంగి లక్షణ
అందముగా పలుకరేల హరినామములు
కలకాలము నీపేరు నిలచియుండును
కోరి నీపాలబడితి గోవిందుడా
ఇందిరారమణుడా యిందీవరాక్షుడా
హరిభక్తుడైతే చాలు నతడు ముక్తుడే
30, ఆగస్టు 2021, సోమవారం
కోదండరామ హరి గోపాలకృష్ణ హరి
ఇంతబ్రతుకు బ్రతికి యిపుడేమి కోరమందువు
పరవశించి పాడరే హరికీర్తనలు
29, ఆగస్టు 2021, ఆదివారం
శతకపరిచయం.
శతకపరిచయం అన్న పేరుతో వారానికి ఒక శతకం చొప్పున పరిచయం చేయాలని ఆశిస్తున్నాను.
నిన్ననే అగస్త్యలింగ శతకాన్ని పరిచయం చేయటం జరిగింది.
ఆసక్తికలవారు వీక్షించండి.
మాలికలో ఈబ్లాగు కలపటానికి కొంచెం సమయం పడుతుంది.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
కనీసం ఈపూట ఐనా ఈ పాటను వినండి.
(టంగుటూరి సూర్యకుమారి గారు పాడినది)
(టంగుటూరి సూర్యకుమారి గారు పాడినది)
(ఈ వీడియోలో పాటతో పాటు సాహిత్యమూ చూపబండింది చక్కగా)
చేయెత్తి జై కొట్టు తెలుగోడా....
వీరగంధము తెచ్చినారము....
28, ఆగస్టు 2021, శనివారం
హరిని గూర్చి మనమేమి యనుకొనవలెనో
హరిభక్తుల నాప్తులని యనుకొనవలెను
హరిమయమీ విశ్వమని యనుకొనవలెను
హరికన్యము నాస్తియని యనుకొనవలెను
హరి నెఱుగుట చాలునని యనుకొనవలెను
హరియె మంచిమిత్రుడని యనుకొనవలెను
హరియె పెద్దచుట్టమని యనుకొనవలెను
హరియె దొడ్ద గురువని యనుకొనవలెను
హరియె పరదైవతమని యనుకొనవలెను
హరేరామ హరేరామ యనుకొనవలెను
హరేకృష్ణ హరేకృష్ణ యనుకొనవలెను
హరి ప్రసాదమే చాలు ననుకొనవలెను
హరిని చేరుకొందునని యనుకొనవలెను
జయజయ శ్రీరామచంద్ర
25, ఆగస్టు 2021, బుధవారం
హరియిచ్చిన యన్నమే యమరును కాని
24, ఆగస్టు 2021, మంగళవారం
నిద్దుర రాదాయె నాకు నీదయ వలన
రామరామ సీతారామ రాఘవేంద్ర యనరే
23, ఆగస్టు 2021, సోమవారం
భామాకలాపం - 1978
( ఈ వీడియోను యూట్యూబులో చూడవలసి ఉంటుంది. నేరుగా టపాలో ప్లే కావటం లేదు)
ఎప్పుడో 1978వ సంవత్సరంలో జరిగిన ఒక నృత్యప్రదర్శనం తాలూకు ఆడియో క్లిప్పింగ్ పంపారు శ్రీభాగవతుల సేతురాం గారు.
ఆయన శ్రీ భాగవతుల రామకోటయ్య గురువు గారి కుమారులు, స్వయంగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు.
మాశ్రీమతి శారద శ్రీభాగవతుల రామకోటయ్య గారి శిష్యురాలు, ఆయన వద్ద కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేసింది.
ఈ ఆడియోలో భామాకలాపాన్ని గురువుగారితో కలిసి పాడినది మా శ్రీమతి శారద. చాలా ప్రదర్శనల్లో గురువుగారితో కలిసి పాడినట్లు ఆమె చెబుతూ ఉంటుంది.
అప్పట్లో వీడియో రికార్డింగులు లేవు కదా. అందుకని ఆడియో రికార్డు మాత్రం కొంచెం ఉండి ఉంటుంది. ఫోటోలు కూడా ఒకటో అరో ఇంకా ఉండి ఉండవచ్చును. ఒక ఫోటో జతచేసి సత్యభామగా చేసిన ఉమ గారు ఈ ఫిబ్రవరిలో యూట్యూబులో ఉంచారు. దానిని ఈరోజున సేతురాం గారు పంపగా చూసాం.
పెద్దపెద్ద కళ్ళ వాడు పెద్దింటి పిల్లవాడు
సత్యము నెఱుగుడు జనులారా సద్గతి నొందుడు జనులారా
కాంతాకనకమ్ములకై భ్రమసిన కలుగును నరకము జనులారా
22, ఆగస్టు 2021, ఆదివారం
భజే రామచంద్రం భజే రాఘవేంద్రం
21, ఆగస్టు 2021, శనివారం
బంతులాడ రారా నేడు బాలకృష్ణా
20, ఆగస్టు 2021, శుక్రవారం
దేహినిరా నేను దేవదేవా
19, ఆగస్టు 2021, గురువారం
శ్రీ జై గొట్టిముక్కల నిర్యాణం.
కుటుంబ సభ్యులు అందించిన వివరాలు:
శ్రీ జై గొట్టిముక్కల గారు ఈనెల ఒకటవ తారీఖున ఉదయ సమయంలో పరమపదించారు.
ఈ విషాదవార్త నాకు ఇప్పడే తెలిసింది.
కొన్నాళ్ళుగా నేను బ్లాగుల్లో చురుకుగా లేక, జై గారు ఈమధ్యన బ్లాగుల్లో కనబడటం లేదన్నది ఆలస్యంగా నిన్ననే గమనించాను.
వెంటనే వారికి ఈమెయిల్ పంపాను.
కానీ స్పందన రాలేదు.
వారు సాధారణంగా నాకు వెంటనే స్పందిస్తారు. కాని జవాబు రాకపోవటం ఆదుర్దాను పెంచింది.
కొద్ది నిముషాల క్రిందట ఆయన నెంబరుకు ఫోన్ ఛేస్తే వారి సతీమణి గారు ఈదుర్వార్తను తెలిపారు.
జైగారు ఈ జనవరి నుండి కాన్సర్ కారణంగా అస్వస్థతకు గురియై ఉన్నారట. అస్పత్రిలో చికిత్సపొందుతూ ఉన్నారట.
బ్లాగు ప్రపంచంలో మంచి విషయపరిజ్ఞానమూ విశ్లేషణాపాటవమూ కలవారిగా జైగారికి మంచి పేరుంది.
ఇక ఆయన మనకు దూరం కావటం పెద్దలోటే.
జై గారి ఆత్మకు ఉత్తమగతులు కలుగు గాక!
ప్రజాస్వామ్యం నవ్వులపాలౌతున్నదట కొత్తగా
ప్రజాస్వామ్య వ్యవస్థను మన ఘనతవహించిన రాజకీయనాయకులు ఏనాడో నవ్వులపాలు చేసేసారు. ఇప్పుడు కొత్త ఏముంది?
చిన్న రాష్ట్రాల సిధ్ధాంతం అంటూ నాటకాలాడి తెలుగుగడ్డను రెండు ముక్కలు చేయటానికి భాజపా వారు ఆడిన నాటకం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయలేదా?
నాటకం కాకపోతే తెలుగుగడ్డను అడ్డదిడ్డంగా ఆదరాబాదరాగా రెండుముక్కలు చేసిన తరువాత తామే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ఎందుకు పాతరవేసారో?
నాటకం కాకపోతే ఏదో ఆంధ్రాకు న్యాయం చేయటానికి తెగ తసతహలాడుతున్నట్లు మాటలాడి తాము కేంద్రంలో అధికారంలోనికి వచ్చి నాలుకలు ఎందుకు మడతవేసి ఆంధ్రాకు అక్షరాలా తీరని ద్రోహం చేసినట్లో.
నాటకం కాకపోతే కేంద్రంలో అధికారం చేతికి రాగానే తమకు మిత్రపక్షంగా ఉన్న పార్టీని వేధించి దూరంపెట్టి ఆంధ్రాలో ఎదగాలని ప్రయత్నం చేసి ఇంకా అవకాశం కోసం అంగలార్చటాన్ని ఏమంటారో.
తమ కుచేష్టలు ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేయలేదా?
ఇప్పుడు ఆనాటకాల వెనుకనున్న ఒక పెద్దాయన తన మాట సభలో ఎవరూ వినటం లేదని ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఎన్నడూ లేనట్లు నవ్వులపాలౌతోందని విచారం వెలిబుచ్చటం ఏమిటీ?
చీకటిగదిలో రాష్ట్ర విభజననాటకం ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసిననాడు తమకు చీమకుట్ఞినట్లు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఎంత ఆదుర్దా!!
18, ఆగస్టు 2021, బుధవారం
వీరి వారి నాశ్రయించి వివిదకష్టములు పడక
శ్రీరామాష్టోత్తరశతనామావళి - నామవిభజన
శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥
వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః ।
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః ॥ 3 ॥
కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥
సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥
వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ ।
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥
త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః ।
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యవర్తనః ॥ 7 ॥
అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః ।
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః ॥ 8 ॥
ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః ।
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥
సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః ।
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥
సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః ।
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥
సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ।
ఆదిపురుషః పరమపురుషో మహాపూరుష ఏవ చ ॥ 12 ॥
పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః ।
స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥
అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః ।
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥
సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః ।
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥
సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః ।
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః ॥ 16 ॥
పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ।
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః ॥ 17 ॥
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥
ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం
◇శ్రీరామో ◇రామభద్రశ్చ ◇రామచంద్రశ్చ ◇శాశ్వతః ।
◇రాజీవలోచనః ◇శ్రీమా◇న్రాజేంద్రో ◇రఘుపుంగవః ॥ 1 ॥
◇జానకీవల్లభో ◇జైత్రో ◇జితామిత్రో ◇జనార్దనః ।
◇విశ్వామిత్రప్రియో ◇దాంతః ◇శరణత్రాణతత్పరః ॥ 2 ॥
◇వాలిప్రమథనో ◇వాగ్మీ ◇సత్యవా◇క్సత్యవిక్రమః ।
◇సత్యవ్రతో ◇వ్రతధరః ◇సదాహనుమదాశ్రితః ॥ 3 ॥
◇కౌసలేయః ◇ఖరధ్వంసీ ◇విరాధవధపండితః ।
◇విభీషణపరిత్రాతా ◇హరకోదండఖండనః ॥ 4 ॥
◇సప్తతాలప్రభేత్తా చ ◇దశగ్రీవశిరోహరః ।
◇జామదగ్న్యమహాదర్పదలన◇స్తాటకాంతకః ॥ 5 ॥
◇వేదాంతసారో ◇వేదాత్మా ◇భవరోగస్య భేషజమ్ ।
◇దూషణత్రిశిరోహంతా ◇త్రిమూర్తి◇స్త్రిగుణాత్మకః ॥ 6 ॥
◇త్రివిక్రమ◇స్త్రిలోకాత్మా ◇పుణ్యచారిత్రకీర్తనః ।
◇త్రిలోకరక్షకో ◇ధన్వీ ◇దండకారణ్యవర్తనః ॥ 7 ॥
◇అహల్యాశాపశమనః ◇పితృభక్తో ◇వరప్రదః ।
◇జితేంద్రియో ◇జితక్రోధో ◇జితామిత్రో ◇జగద్గురుః ॥ 8 ॥
◇ఋక్షవానరసంఘాతీ ◇చిత్రకూటసమాశ్రయః ।
◇జయంతత్రాణవరదః ◇సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥
◇సర్వదేవాదిదేవశ్చ ◇మృతవానరజీవనః ।
◇మాయామారీచహంతా చ ◇మహాదేవో ◇మహాభుజః ॥ 10 ॥
◇సర్వదేవస్తుతః ◇సౌమ్యో ◇బ్రహ్మణ్యో ◇మునిసంస్తుతః ।
◇మహాయోగీ ◇మహోదారః ◇సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥
◇సర్వపుణ్యాధికఫలః ◇స్మృతసర్వాఘనాశనః ।
◇ఆదిపురుషః ◇పరమపురుషో ◇మహాపూరుష ఏవ చ ॥ 12 ॥
◇పుణ్యోదయో ◇దయాసారః ◇పురాణపురుషోత్తమః ।
◇స్మితవక్త్రో ◇మితభాషీ ◇పూర్వభాషీ చ ◇రాఘవః ॥ 13 ॥
◇అనంతగుణగంభీరో ◇ధీరోదాత్తగుణోత్తమః ।
◇మాయామానుషచారిత్రో ◇మహాదేవాదిపూజితః ॥ 14 ॥
◇సేతుకృ◇జ్జితవారాశిః ◇సర్వతీర్థమయో ◇హరిః ।
◇శ్యామాంగః ◇సుందరః ◇శూరః ◇పీతవాసా ◇ధనుర్ధరః ॥ 15 ॥
◇సర్వయజ్ఞాధిపో ◇యజ్వా ◇జరామరణవర్జితః ।
◇శివలింగప్రతిష్ఠాతా ◇సర్వావగుణవర్జితః ॥ 16 ॥
◇పరమాత్మా ◇పరం బ్రహ్మ ◇సచ్చిదానందవిగ్రహః ।
◇పరంజ్యోతిః ◇పరంధామ ◇పరాకాశః ◇పరాత్పరః ॥ 17 ॥
◇పరేశః ◇పారగః ◇పారః ◇సర్వదేవాత్మకః ◇పరః ॥
ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం ||18||
ఐతే మనం పూజాకార్యక్రమం కోసం నామావళిని పఠించేదుకు ప్రతినామానికి మొదట ఓంకారాన్నీ చివర నమః అనీ చేర్చు చెప్తూ ఉంటాం కదా. పై విధానంలో 108 నామాల అమరికను స్పష్టంగా చూపటం జరిగినా పూజాదికాలకోసం చదివే విధానంగా చూపటం అవసరం కాబట్టి ఆ పట్టికను ఇక్కడ ఇస్తున్నాను.
శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥
- శ్రీరామో ఓం శ్రీరామాయ నమః
- రామభద్రశ్చ ఓం రామభద్రాయ నమః
- రామచంద్రశ్చ ఓం రామచంద్రాయ నమః
- శాశ్వతః ఓం శాశ్వతాయ నమః
- రాజీవలోచనః ఓం రాజీవలోచనాయ నమః
- శ్రీమా ఓం శ్రీమతే నమః
- న్రాజేంద్రో ఓం రాజేంద్రాయ నమః
- రఘుపుంగవః ఓం రఘుపుంగవాయ నమః
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥
- జానకీవల్లభో ఓం జానకీవల్లభాయ నమః
- జైత్రో ఓం జైత్రాయ నమః
- జితామిత్రో ఓం జితామిత్రాయ నమః
- జనార్దనః ఓం జనార్ధనాయ నమః
- విశ్వామిత్రప్రియో ఓం విశ్వామిత్రప్రియాయ నమః
- దాంతః ఓం దాంతాయ నమః
- శరణత్రాణతత్పరః ఓం శరణత్రాణతత్పరాయ నమః
వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః ।
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః ॥ 3 ॥
- వాలిప్రమథనో ఓం వాలిప్రమథనాయ నమః
- వాగ్మీ ఓం వాగ్మినే నమః
- సత్యవా ఓం సత్యవాచే నమః
- క్సత్యవిక్రమః ఓం సత్యవిక్రమాయ నమః
- సత్యవ్రతో ఓం సత్యవ్రతాయ నమః
- వ్రతధరః ఓం వ్రతధరాయ నమః
- సదాహనుమదాశ్రితః ఓం సదాహనుమదాశ్రితాయ నమః
కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥
- కౌసలేయః ఓం కోసలేయాయ నమః
- ఖరధ్వంసీ ఓం ఖరధ్వంసినేనమః
- విరాధవధపండితః ఓం విరాధవధపండితాయ నమః
- విభీషణపరిత్రాతా ఓం విభీషణపరిత్రాత్రే నమః
- హరకోదండఖండనః ఓం హరకోదండఖండనాయ నమః
సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥
- సప్తతాలప్రభేత్తా చ ఓం సప్తతాళ ప్రభేత్తాయ నమః
- దశగ్రీవశిరోహరః ఓం దశగ్రీవశిరోహరాయ నమః
- జామదగ్న్యమహాదర్పదలన ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
- స్తాటకాంతకః ఓం తాటకాంతకాయ నమః
వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ ।
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥
- వేదాంతసారో ఓం వేదాంత సారాయ నమః
- వేదాత్మా ఓం వేదాత్మనే నమః
- భవరోగస్య భేషజమ్ ఓం భవరోగస్యభేషజాయ నమః
- దూషణత్రిశిరోహంతా ఓం దూషణత్రిశిరోహంతాయ నమః
- త్రిమూర్తి ఓం త్రిమూర్తయే నమః
- స్త్రిగుణాత్మకః ఓం త్రిగ్రుణాత్మకాయ నమః
త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః ।
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యవర్తనః ॥ 7 ॥
- త్రివిక్రమ ఓం త్రివిక్రమాయ నమః
- స్త్రిలోకాత్మా ఓం త్రిలోకాత్మనే నమః
- పుణ్యచారిత్రకీర్తనః ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః
- త్రిలోకరక్షకో ఓం త్రిలోకరక్షకాయ నమః
- ధన్వీ ఓం ధన్వినే నమః
- దండకారణ్యవర్తనః ఓం దండకారణ్యవర్తనాయ నమః
అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః ।
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః ॥ 8 ॥
- అహల్యాశాపశమనః ఓం అహల్యాశాపశమనాయ నమః
- పితృభక్తో ఓం పితృభక్తాయ నమః
- వరప్రదః ఓం వరప్రదాయ నమః
- జితేంద్రియో ఓం జితేంద్రియాయ నమః
- జితక్రోధో ఓం జితక్రోధాయ నమః
- జితామిత్రో ఓం జితామిత్రాయ నమః
- జగద్గురుః ఓం జగద్గురవే నమః
ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః ।
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥
- ఋక్షవానరసంఘాతీ ఓం ఋక్షవానరసంఘాతినే నమః
- చిత్రకూటసమాశ్రయః ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
- జయంతత్రాణవరదః ఓం జయంతత్రాణవరదాయ నమః
- సుమిత్రాపుత్రసేవితః ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః ।
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥
- సర్వదేవాదిదేవశ్చ ఓం సర్వదేవాదిదేవాయ నమః
- మృతవానరజీవనః ఓం మృతవానరజీవనాయ నమః
- మాయామారీచహంతా చ ఓం మాయామారీచహంత్రే నమః
- మహాదేవో ఓం మహాదేవాయ నమః
- మహాభుజః ఓం మహాభుజాయ నమః
సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః ।
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥
- సర్వదేవస్తుతః ఓం సర్వదేవస్తుతాయ నమః
- సౌమ్యో ఓం సౌమ్యాయ నమః
- బ్రహ్మణ్యో ఓం బ్రహ్మణ్యాయ నమః
- మునిసంస్తుతః ఓం మునిసంస్తుతాయ నమః
- మహాయోగీ ఓం మహాయోగినే నమః
- మహోదారః ఓం మహోదారాయ నమః
- సుగ్రీవేప్సితరాజ్యదః ఓం సుగ్రీవేప్సితరాజ్యప్రదాయ నమః
సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ।
ఆదిపురుషః పరమపురుషో మహాపూరుష ఏవ చ ॥ 12 ॥
- సర్వపుణ్యాధికఫలః ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
- స్మృతసర్వాఘనాశనః ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
- ఆదిపురుషః ఓం ఆదిపురుషాయ నమః
- పరమపురుషో ఓం పరమపురుషాయ నమః
- మహాపూరుష ఏవ చ ఓం మహాపురుషాయ నమః
పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః ।
స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥
- పుణ్యోదయో ఓం పుణ్యోదయాయ నమః
- దయాసారః ఓం దయాసారాయ నమః
- పురాణపురుషోత్తమః ఓం పురుషోత్తమాయ నమః
- స్మితవక్త్రో ఓం స్మితవక్త్రాయ నమః
- మితభాషీ ఓం మితభాషిణే నమః
- పూర్వభాషీ చ ఓం పూర్వభాషిణే నమః
- రాఘవః ఓం రాఘవాయ నమః
అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః ।
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥
- అనంతగుణగంభీరో ఓం అనంతగుణగంభీరాయ నమః
- ధీరోదాత్తగుణోత్తమః ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
- మాయామానుషచారిత్రో ఓం మాయామానుషచారిత్రాయ నమః
- మహాదేవాదిపూజితః ఓం మహాదేవాదిపూజితాయ నమః
సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః ।
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥
- సేతుకృ ఓం సేతుకృతే నమః
- జ్జితవారాశిః ఓం జితవారాశయే నమః
- సర్వతీర్థమయో ఓం సర్వతీర్ధమయాయ నమః
- హరిః ఓం హరయే నమః
- శ్యామాంగః ఓం శ్యామాంగాయ నమః
- సుందరః ఓం సుందరాయ నమః
- శూరః ఓం శూరాయ నమః
- పీతవాసా ఓం పీతవాససే నమః
- ధనుర్ధరః ఓం ధనుర్ధరాయ నమః
సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః ।
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః ॥ 16 ॥
- సర్వయజ్ఞాధిపో ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
- యజ్వా ఓం యజ్వినే నమః
- జరామరణవర్జితః ఓం జరామరణవర్జితాయ నమః
- శివలింగప్రతిష్ఠాతా ఓం శివలింగప్రతిష్టాత్రే నమః
- సర్వావగుణవర్జితః ఓం సర్వావగుణవర్జితాయ నమః
పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ।
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః ॥ 17 ॥
- పరమాత్మా ఓం పరమాత్మనే నమః
- పరం బ్రహ్మ ఓం పరబ్రహ్మణే నమః
- సచ్చిదానందవిగ్రహ ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
- పరంజ్యోతిః ఓం పరస్మైజ్యోతిషే నమః
- పరంధామ ఓం పరంధామాయ నమః
- పరాకాశః ఓం పరాకాశాయ నమః
- పరాత్పరః ఓం పరాత్మరాయ నమః
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥
ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం ॥ 18 ॥
- పరేశః ఓం పరేశాయ నమః
- పారగః ఓం పారగాయ నమః
- పారః ఓం పారాయ నమః
- సర్వదేవాత్మకః ఓం సర్వదేవాత్మకాయ నమః
- పరః ఓం పరస్మై నమః
17, ఆగస్టు 2021, మంగళవారం
పరమానందముగా శ్రీరాముని భావనచేయవయా
16, ఆగస్టు 2021, సోమవారం
నోరారా హరినామము నుడివిన చాలు సంసారమనే మాయతెర జారిపోవును
బలవిషయము
ప్రపంచమున మానవులు వివిధ కారణముల వలన తమను తాము బలవంతులమని లెక్కించుకొనుచున్నారు.
కొందరివద్ద విశేషముగా ధనముండును. అట్లు విశేషధనసంపద కలవారినే లోకులు కలవారని వ్యవహరించు చున్నారు. పదిమంది బిడ్డలు కలవానిని జనులు కలవాడనరు. పదిపదుల కధికముగనే విశేషముగా బంధుగణమున్న వానిని లోకులు కలవాడనుట లేదు. బహుశాస్త్రపాండిత్యము కలవానిని లోకులు కలవా డనుట లేదు. చివర కతీంద్రియశక్తులు కలవాని నైనను లోకులు కలవాడనుట లేదు. నాలుగు కాసులు తమకంటె హెచ్చుగా కలిగిన వానిని మాత్రమే కలవా డనుచున్నారు కదా. ఆకలవారే బలవంతులని లోకవ్యవహారముగ నున్నది. అట్లే ధనము దండిగ కలవారును లోకవ్యవహారము ననుసరించి తామే బలవంతులమను భ్రమతో మిక్కిలి గర్వము చూపుచున్నారు. నేడున్న నేమాయె రేపకడ నిలకడ కలదా ధనమున కన్న స్పృహ వారికి కలుగదే. నిలుకడ లేని ధనము కలవారి బలమును నిలుకడలేనిదై నమ్మరానిది కదా. కావున ధనబలము నిక్కమైన బలము కాదు. కానే కాదు రామచంద్రప్రభో.
బలమనగా ప్రాథమికముగా శారీరక బలమే బలమను భావన జనసహజమై యున్నది. స్ర్రీబాలవృధ్ధులు బలహీనులును యువకులు బలవంతులు ననునది జనాభిప్రాయము. ఉపాధి ననుసరించి బలాబలములు ప్రకృతిలో హెచ్చుతగ్గులుగా నుండుట సర్వవిదితమే. ఒక ఈగ కన్న నొక తొంద బలమైనది. ఆ యొక తొండ కన్న కాకి బలమైఅది. ఆ కాకి కన్న గ్రద్ద బలముకలది. ఎలుక కన్న పిల్లి బలమైనది.ఆ పిల్లి కన్న కుక్క బలమైనది. కుక్క కన్న నేనుగు బలమైనది. కాని యెంత పెద్ద గజమైనను వార్ధకము కారణముగా కదులలేని స్ధితికి వచ్చిననాడు దాని కంటెను దాని ముందే పరుగులుతీయు నొక యెలుక దానికన్న బలమైనది యగుచున్నది కదా. ఒక బలమైన మొసలి నీటిలో నుండగా దేనినైనను పట్టవచ్చును కాని యొడ్డున నున్న వేళ నొక కుక్కయైనను దానితో పరాచికము లాడనేర్చునే కదా. కావున నుపాధి గతమైనదో వయోవస్థాశ్రయమైనదో యగుచున్నట్టి శారీరకబల మేమి బలము. అది నిక్కమైన బలమే కాదు. కానే కాదు రామచంద్రప్రభో.
అధికారము కలవారిని జనులు బలవంతులని యందురు. పూచికపుల్ల వంటి రూపురేఖలున్న వాడైనను వాడు రాజోద్యోగి యగుచో జనులు వాని యధికారబలమును గమనించి భయభక్తులతో మెలగుచుందురు. అధికారి యవివేకి యగచో వాని యాశ్రితులును బంధుమిత్రులును కూడ లేనిపోని బలప్రదర్శనములు చేయుచుందురు. ఒక డధికారము కొంత కలవా డగుచో మరికొంతగ నధికారము కలవా డింకొకడు వాని నెత్తిపై నుండును. పైవానికి నచ్చని నాడు క్రిందివానికి యధికారము చేజారును. సర్వాధికారి నని భావించు రాజును మరొకడు కూలద్రోయ వచ్చును. కాలగతి ననుసరించి చెడుచుండు నధికారముల వలన నబ్బు బలము నమ్మదగినది కాదు. కావున నది నిక్కమైనబలము కాదు. యెన్నటికి కాదు రామచంద్రప్రభో.
విద్యావిషయమకై మనుజుల మధ్య స్పర్ధ యుండుటను చూచుచునే యున్నాము. ఒక పండితునకు మరొకనితో పదిమంది ముందు తలపడవలసిన పరిస్థితి వచ్చుచున్నప్పుడు వారిలో నొకడు ఆవలి వానిని గూర్చి తనకంటే వాడు బలవంతుడని యనుచున్నాడు లేడా వాడు బలహీనుడు పొమ్మనుచున్నాడు. ఎవనికి ఏతఛ్ఛాస్త్రవిషయమకమై పాండిత్యమధికమో వాడు వారిద్దరిలో బలవంతుడని లోకోక్తిగా నున్నది. సమస్తమైన కళలవిషయముగా నిట్టి వ్యవహారమున్నది. కాని నేడు ఒక కళలో కాని శాస్త్రములో కాని బలమైనవాడుగా నున్న వ్యక్తి మరొక దినమున వయస్సు కారణముగనో మరొక కారణముగనో బలహీనపడవచ్చును. కావున విద్యాప్రజ్ఞయే నిలుకడగల బలమని భావించుట యసంగత మగుచున్నది. కావున విద్యాప్రజ్ఞ నిక్కమైన బలము కాదు కదా రామచంద్రప్రభో
ముఖ్యముగా దైవబలమని యొక బలమున్నదని చెప్పుదురు. ఇట్టి బలము కలవారిలో గొప్పవాడు ప్రహ్లాదుడని పెద్దల వాక్యము. హిరణ్యకశిపుడు తన కన్నకొడుకనియును దయజూపక బాలప్రహ్లాదుని చంపుటకునై రకరకములుగా ప్రయత్నించి విఫలుడై విసివి ఓరి పిల్లవాడా నిన్ను చంపుట దుస్సాధ్యముగా నున్నదే ప్రపంచములో నాకన్న బలశాలి లేడే నీబల మేమిరా యింత దుస్సహముగా నున్నదీ నీవెవ్వని బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడవై యని ఆశ్చర్యపడగా బాలుడు సంతోషముగా