రాకాసులు రెచ్చిపోయి రాజ్యాలేలేరా - రాజ్యాలేలేరా
తోకముడిచి హనుమంతుడు తొలగి నిలచేనా - తొలగి నిలచేనా
తెలుగువారి ఐకమత్య బలిమి వట్టిదేనా - చిలుకపలుకులేనా
తెలుగువాళ్ళ బుర్రల్లో తెలివి తక్కువేనా - తెలివిడి సున్నేనా
తెలుగువారి దైవభక్తి కలిమి డొల్లయేనా - నిలువున డొల్లేనా
తెలుగుగడ్డ మీద దేవతలకు చోటులేదా - నిలువనీడ లేదా
సోది కైన లేదు తెగువ శూన్యం మిగిలేనా - హైన్యం మిగిలేనా
వాద వివాదాలతో వేదన తొలగేనా - బాధలు తొలగేనా
కాదు కాదు కాదంటే కష్టం తగ్గేనా - నష్టం తగ్గేనా
రాదు రాదంటే ముప్పు రాకుండా పోదు - లేకుండా పోదు
తెలుగువాడి మెతకతనం తొలగవలె నేడు - తొలగవలె నేడు
తెలుగువాడు హనుమన్నై తిరిగి దెబ్బకొట్టి - తిరగబడ్డ నాడు
నిలువలేరు రాకాసులు తెలుగుప్రభల ముందు - తెలుగుగడ్డ మీద
తెలుసుకోండి నిజము రామదేవునిపై అన - దేవునిపై అన
4, జనవరి 2021, సోమవారం
రాకాసులు రెచ్చిపోయి రాజ్యాలేలేరా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆశాదృక్పథం అభిలషణీయమే కానీ నాకయితే ఇప్పట్లో వెలుగుకిరణం ఏదీ దూరాన కూడా పెద్దగా కనబడటం లేదండి.
రిప్లయితొలగించండి