ధ్యేయుడు శ్రీహరి రాముడు మా యిలవేలుపు రాముడు
మాయామర్మము లేనివాడు కడు మంచివాడు మా రాముడు
పతితపావనుడు రాముడు భవతారకుడు రాముడు
అతిసన్నిహితుడు రాముడు సతతసేవ్యుడు రాముడు
హితమితవచనుడు రాముడు ధృతకోదండుడు రాముడు
శ్రితమందారుడు రాముడు సీతానాథుడు రాముడు
కరుణానిలయుడు రాముడు కమలేక్షణుడు రాముడు
వరదాయకుడు రాముడు వందనీయుడు రాముడు
పరమసుందరుడు రాముడు భక్తవరదుడు రాముడు
నిరుపమానుడు రాముడు పరమేశ్వరుడు రాముడు
ఇనకులేశ్వరుడు రాముడు ఘనసచ్చరితుడు రాముడు
దనుజాంతకుడు రాముడు ధనుష్మదగ్రణి రాముడు
మనుజనాథుడు రాముడు మహీతలేశుడు రాముడు
మునికులవినుతుడు రాముడు మోహనాంగుడు రాముడు
ఇది ఈ శ్యామలీయం బ్లాగులో 2004వ టపా.
రిప్లయితొలగించండి(ఇప్పటికి వచ్చిన సందర్శకుల సంఖ్య 8,80,000+ నేటికి వ్యాఖ్యల సంఖ్య 4016)
“కమలలేక్షణుడు” ??
రిప్లయితొలగించండి================
టపాలు రెండు వేల సంఖ్యను దాటినందుకు అభినందనలండి. తతిమ్మా స్టాటిస్టిక్స్ కూడా సంతృప్తికరంగానే ఉన్నట్లున్నాయి కదా? దాదాపు తొమ్మిది లక్షల సందర్శకులు అంటే మామూలు మాట కాదు. దానర్థం వ్యాఖ్య పెట్టినా పెట్టకపోయినా చాలా మందే మీ బ్లాగును చూస్తున్నారని. బాగుందండీ 👏. ఇలాగే మరెన్నో మైలురాళ్ళను దాటాలని మా ఆకాంక్ష 👍.
ఈమధ్య సమయాభావం కారణంగా, మొబైల్ ఫోన్ మీద టైపింగ్ చేసి పబ్లిష్ చేయటం తప్పటం లేదండీ. అందువలన తప్పులు పడుతున్నాయి.
తొలగించండిరెండువేలు వగైరా సంఖ్యలను ఈరోజు అనుకోకుండా గమనించానండి. అదే అందరితో పౌచుకున్నాను. మైలురాళ్ళేమీ అనుకోనండీ, ఓపిక ఉన్నంతవరకు వ్రాయడమే అనుకుంటున్నాను.
అలాగే ... ఓపిక, ఆసక్తి ఉన్నంతవరకు మీరు వ్రాస్తూ ఉండండి, మైలురాళ్ళ అవే దాటుతాయి 👍.
తొలగించండిఅలాగే ... ఓపిక, ఆసక్తి ఉన్నంతవరకు మీరు వ్రాస్తూ ఉండండి ... మైలురాళ్ళు వాటంతట అవే దాటుతాయి 👍.
తొలగించండి