3, జనవరి 2021, ఆదివారం

రాముడంటే

రాముడంటే గౌరవమా రాకాసులకా

భూమిసుతను రాకాసులు పూజించేరా


రాముడికి కొత్తకాదు రాకాసుల దుండగాలు

ప్రేమతో బోధిస్తే వింటారా రాకాసుల మూకలు

రాముడి బాణాలకు రాకాసులు కొత్తకాదు

భూమికీ కొత్తకాదు ముష్కరుల నెత్తుళ్ళు


మాయలేడి వేషముతో మారీచుడు వంచించెను

మాయచే రామశిరము మలచినాడు రావణుడు

మాయాసీతను చంపి మాయచేసె వాడి కొడుకు

మాయలన్ని వమ్మాయెను మరి వారికి చావాయెను


మొన్నమొన్న శ్రీరాముని బొమ్మ నొకడు విరచెను

నిన్ననే దుష్టుడొకడు నిక్కి సీత బొమ్మ విరచె

చిన్నచిన్న తప్పులనుచు శిక్షించక విడువడుగా 

అన్నన్నా రాకాసుల నణిచివేయు రఘువీరుడు


1 కామెంట్‌:

  1. పాపాలు ఇంకా పండలేదండి. ఆ రోజు వచ్చాక ఇక విలవిలలాడటం తప్ప వారికి గత్యంతరం లేదు.
    విద్రోహులకు త్వరగా శిక్షపడాలని ప్రార్ధించడం తప్ప గత్యంతరం లేదు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.