కొత్త సంవత్సరం వచ్చేసింది.
ఎందరో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
కొందరైతే ఆ నిర్ణయాలను ప్రకటిస్తారు.
కొంచెం మంది మాత్రమే వాటిని అమలు చేస్తారు.
నా నిర్ణయం వినండి. ఎన్నో లేవు లెండి ఒకటే. దానిని నిలబెట్టుకుంటే చాలు.
"నేటి నుండి మాలిక వ్యాఖ్యల పేజీని చూడను"
ఇదే నండి కొత్త సంవత్సరం నిర్ణయం.
కారణం ఏమిటీ అంటారా?
మాలిక వ్యాఖ్యల పేజీలో కనిపిస్తున్న భాషను చూస్తున్నారు కదా? అదే కారణం.
మళ్ళీ వచ్చే జనవరి 1న ఆపేజీని చూడటం గురించి ఆలోచిస్తాను.
మాలిక గురించి నిర్ణయం కొన్నాళ్ళ క్రితం తీసుకున్నదే. వారికి కూడా తెలియజేసినదే. నేటి నుండి అమలులో పెడుతున్నాను.
కొత్త సంవత్సర నిర్ణయాలు చేసుకోవడం మంచి పనే లెండి.
రిప్లయితొలగించండికానీ ఇతర బ్లాగుల్లో మీ గురించి ఏవయినా వ్యాఖ్యలు వచ్చాయేమో అనయినా చూడనంటే ఎలాగ మరి?
మీకందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఏం చేసేది చెప్పండి. మాలికలో ఆపేజీ నిండా కొల్లలుగా అసభ్యాలూ అసభ్యాలూ నాయె.
తొలగించండి
రిప్లయితొలగించండిమాలికలో మీ గురించి ఎవరో అవాకులు చెవాకులూ పేలుతున్నారాండీ
నా గురించి అని కాదండీ. అక్కడ కనిపిస్తున్న భాషను భరించలేక ఇక వద్దు అనుకున్నా నండీ. ఈ పరిస్థితికి కారణం ఇదీ అని చెప్పాను కదండీ.
తొలగించండి
తొలగించండిహమ్మయ్యా !
చాలా మంచి నిర్ణయమండీ :)
నా కందాలకిక అడ్డే వుండదు :(
జిలేబి
మంచిది అనిపించే ఈ నిర్ణయం తీసుకున్నా నండీ. మీరు కందపద్యాలు వ్రాద్దా మనుకుంటున్నారా. అలాగే. తప్పకుండా ప్రయత్నించండి.
తొలగించండిఇలాగా రిజల్యూషన్ పాస్ చేసి పారేయటం సుళువే లెండి. నిక్కచ్చిగా అమలు చేయటం ఎంతో కష్టం!
రిప్లయితొలగించండిఈ ఉదయం మాలిక వ్యాఖ్యలపేజీ ఓపెన్ చేసినంత పనయ్యింది. అలవాటు తొందరగా వదలదు కదా.