శివుడిచ్చే దేదో శివుడిచ్చునులే కాని
శివుడికే మిచ్చేవో చెప్పవయ్యా
నువ్వు - శివుడికే మిచ్చేవో చెప్పవయ్యా
ముందు - శివుడికే మిచ్చేవో చెప్పవయ్యా
హరుని ముందు ఒకేఒక్క అరటిపండు పెడతావు
వరసపెట్టి కోరుతావు వందకోరికలు
నువ్వు - వరసపెట్టి కోరుతావు వందకోరికలు
రోజూ - వరసపెట్టి కోరుతావు వందకోరికలు
అరటిపండు తిని నీకు అడిగిన విచ్చెయ్యాలా
కొరగాని కోరికలు తీర్చెయ్యాలా
నువ్వు - అరటిపండు కొన్న డబ్బు లెవరిచ్చారో
నువ్వు - కొన్న అరటిపండు శివుని సృష్టి కాదో
శివుడిచ్చిన డబ్బులతో శివసృష్టిలోని పండు
శివుడికే లంచంగా పెడుతున్నావా
నువ్వు - శివుడికే లంచంగా పెడుతున్నావా
పెట్టి - అడ్డమైనవన్నీ నువ్వడుగుతున్నావా
శివుడు రామనామము చేయమన్నాడు నిన్ను
సవినయముగ జపమును సలుపుచున్నావా
నువ్వు - రామనామ మించుక చేయుచున్నావా
అవ్వ! రామనామ మసలు నీకు గురుతున్నదా
30, జనవరి 2021, శనివారం
శివుడిచ్చే దేదో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగా అన్నారు, శ్యామలరావు గారు 👍.
రిప్లయితొలగించండి1961 లో జాన్ ఎఫ్ కెనెడీ అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తూ తన ప్రసంగంలో అన్న ఈ మాటలు గుర్తొచ్చేలా ఉంది మీరు వ్రాసినది 👌.
-------
అమెరికా నీకేం చేస్తుందని అడగద్దు; నువ్వు అమెరికా కోసం ఏం చేస్తావో చెప్పు.
“Ask not what your country can do for you – ask what you can do for your country” (JFK)
-------
ఆ లెవెల్లో ఉందండి మీ ఈ కవిత 👌.
President Kennedy's quotation
https://www.brainyquote.com/quotes/john_f_kennedy_109213
చాలా ధన్యవాదా లండీ. మంచి విషయాలు తెలియజేసారు.
తొలగించండిఇది కూడా సాంప్రదాయిక కీర్తనే అయినా కొంచెం భిన్నంగా ఆధునిక కవితా రూపంలో ఉన్నట్లుంది నిజమే.
ఈ రెండవసహస్రంలోని రామ కీర్తనలలో వివిధ రూపాల్లో వ్యక్తీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. సింహభాగం పాతవిధానంలోనే ఉండవచ్చును.