నమ్మితి నమ్మితి రామయ్యా నా నమ్మకమును నిలబెట్టవయా
నిత్యము నేవో యీతిబాధలకు నిలయమైన నాజీవిత మందున
సత్యమైన యానందము నీయగజాలును నీశుభు నామామృతమని
ఇమ్మహి యమదూతల నెదిరించగ నింపగు నీశుభనామము చాలని
కమ్మని నీశుభనామము చాలని గట్టిగనే నామనసున నెపుడో
కామక్రోధాధికఘనరిపువర్గము నణచగ నీ నామము చాలని
కామితఫలమగు మోక్షము నొసగి కరుణజూప నీ నామము చాలని
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.