14, ఫిబ్రవరి 2024, బుధవారం

రాముడనే పేరుగల రాజొక్క డున్నాడు


రాముడనే పేరుగల రాజొక్క డున్నాడు సు
త్రాముడనే పేరుగల రాజొక్క డున్నాడు

రాముడనే పేరుగల రాజు నరులకెల్ల రాజు సు
త్రాముడనే పేరుగల రాజు సురలకెల్ల రాజు

రాముడనే పేరుగల రాజు చేసె వనవాసము సు
త్రాముడనే పేరుగల రాజు పొందె సంతోషము

రాముడనే పేరుగల రాజు చేసె మహారణము సు
త్రాముడనే పేరుగల రాజు చేసే సాహాయ్యము

రాముడనే పేరుగల రాజు పొందె దిగ్విజయము సు
త్రాముడనే పేరుగల రాజు వచ్చి పొగడి చనెను

రాముడనేపేరుగల రాజంతట గద్దెకెక్క సు
త్రాముడనే పేరుగల రాజు పంపె కానుకలను

రాముడనే పేరుగల రాజు త్రిలోకాధీశుడు సు
త్రాముడనే పేరుగల రాజు త్రిదివనాథుడు

రాముడనే పేరుగల రాజు భవతారకుడు సు
త్రాముడనే పేరుగల రాజు సుఖకారకుడు

రాముడనే పేరుగల రాజు ముక్తిదాయకుడు సు
త్రాముడనేపేరుగల రాజు స్వర్గదాయకుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.